Media | Overaction | Sensation

Media overaction only for the sensation

media, overaction, press, kashmir, exclusive, reporter

media overaction only for the sensation. media searching for sensation but it didnt have the cradility. the media is not follow the values and morals

మీడియాలో.. అతి.. మితిమీరిన అతి

Posted: 04/02/2015 02:02 PM IST
Media overaction only for the sensation

మీడియా అంటేనే అతి చేస్తారు అనే వాదన వినిపిస్తూ ఉంటుంది. కొంత మంది మీడియా ప్రతినిధులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. కొన్ని సార్లు బాధితులు మీడియా ప్రతినిధుల చెంప ఛెల్లుమనిపించారు కూడా. అయినా మేం రాసిందే నిజం వేసిందే సత్యం అన్నట్లు కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తుంటాయి. ఇక కొన్ని మీడియా సంస్థలైతేనా గోరంత దాన్ని కొండంత చేసి చూపుతుంటాయి. అందుకే జనాలకు మీడియా అంటే విసుగు వస్తోంది. తప్పని సరై మీడియాను వార్తల కోసం చూస్తున్నారు తప్పితే నిజాయితీ ఎవరూ నమ్మడం లేదు. మీడియా చేస్తున్న ఇలాంటి అతి.. వాటిలో కొన్ని ఘటనలు మీ కోసం..

* జమ్ము కాశ్మీర్ లో వరదలు వచ్చాయని అందరికి తెలుసు. దాదాపుగా 17 మంది అందులో చనిపోయారని కూడా మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసింది.అయితే కాశ్మీర్ లో భీభత్సమైన వరదలు వస్తున్నాయి. ఊర్లకు ఊర్లు కొట్టుకుపోతున్నాయని వస్తున్న వార్తలపై మాత్రం కాశ్మీరీలు ఆగ్రహంగా ఉన్నారు. బాబూ.. మీడియా మిత్రులారా మీరు ప్రసారం చేస్తున్న కథనాల వల్ల టూరిజం దెబ్బతింటోందని మొర పెట్టుకుంటున్నారు.

* ఇక తాజాగా హైదరాబాద్ లో ఓ విద్యుత్ శాఖ అధికారి ఇంట్లో ఏసిబి దాడులు చేసింది. ఈ క్రమంలో అతడి దగ్గర దాదాపు 20 కోట్ల రూపాయలు అక్రమంగా ఉన్నాయని, అయితే వాటికి లెక్క పత్రాలు లేవని ఏసిబి అధికారులు అనుకుంటున్నట్లుగా ఓ వార్త బయటకు వచ్చింది. దాంతో ఓ మీడియా ప్రతినిధి అత్యుత్సాహం ప్రదర్శించి.. 20 కోట్ల గురించి ఏం మాట్లాడతారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని ప్రశ్నించారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన అతని భార్య ‘20 కోట్లా.. మా దగ్గర ఉన్నవే రెండు మూడు కోట్లు! మరి మిగతావి నువ్వు ఇస్తావా’ అని ప్రశ్నించారు. దాంతో ఖంగుతిన్న మీడియా మిత్రుడు అక్కడ కనిపించకుండా పారిపోయాడు.

* ఏపి రాజధాని నిర్మాణం కోసం అందరూ తమ జీతాల్లో ఒక రోజు జీతాన్ని ఇవ్వాలని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. అయితే ఓ మీడియా మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి అన్నట్లు వార్త రాసి చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నట్లు ఫోటో పెట్టింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : media  overaction  press  kashmir  exclusive  reporter  

Other Articles