తమిళనాట ఎన్ కౌంటర్ పై ఆగ్రహ జ్వాలలు అంతకంతకు పెరుగుతున్నాయి. మొన్న ఏకంగా ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసిన తమ నిరసనలు తెలిపితే.. నిన్న చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మలను దహనం చెయ్యడం, హెరిటేజ్ వ్యాపార సంస్థలపై దాడులు చెయ్యడం చేశారు. అయితే తాజాగా శేషాచలం ఎన్ కౌంటర్ ను నిరసిస్తు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించాలని తమిళ పార్టీ ఎండీఎంకే నేత వైగో పిలుపునిచ్చారు. దాంతో ఏపిలోనూ, తమిళనాడులోనూ వేడి మొదలైంది. వైగో ప్రకటనతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అని సర్వత్రా ఉత్కంతట నెలకొంది. అయితే చిత్తూరు జిల్లాలో పోలీసులు అడుగడుగు జల్లెడ పడుతున్నారు. తమిళనాడు నుండి వస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అటు వైగో మాత్రం రెండు వేల మందితో చిత్తూరు కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ప్రకటించడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.
తమ వారి మృతికి కారణమైన ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై నిన్న తమిళనాడులో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఫోటోలను చెప్పులతో కొట్టడం, చంద్రబాబు దిష్టి బొమ్మలను దహనం చెయ్యడం లాంటివి తమిళనాడులో చాలా చోట్ల చొటుచేసుకున్నాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థపై తమిళ సంఘాలు దాడి చేశాయి. తమిళనాడు రాష్ట్రం మహిళాపూర్ శివారు ప్రాంతంలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. హెరిటేజ్ వస్తువులు ఎవరు కొనుగోలు చేయవద్దంటూ నినాదాలు చేశారు. మొత్తానికి ఏపి ఎన్ కౌంటర్ కీలక మలుపులు తిరుగుతోంది. తమిళనాడు, ఏపిల మధ్య బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల బోర్డర్ ల వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎఫ్పుడు ఏం జరుగుతుందో అని పోలీసులు, సామాన్య ప్రజలు టెన్షన్ పడుతున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more