China | Everest | Rail | Track

China plans to rail track from china to nepal under everest mountain

everest, mount, china, rail, track, way, khimghai, laasa,

china plans to rail track from china to nepal under everest mountain. The china officials trying to constrcut new track under the mount everst for transport facility to nepal through khatmandu.

ఎవరెస్ట్ ను తవ్వి.. రైలు మార్గం వేస్తారట..!

Posted: 04/10/2015 11:51 AM IST
China plans to rail track from china to nepal under everest mountain

చైనా... ప్రపంచం దేశాలకు ధీటుగా అన్నింటిలోనూ దూసుకెళుతోంది. గత రెండు దశాబ్దాలుగా చైనా దూకుడుకు అవధులు లేకుండా పోయాయి. జపాన్ తర్వాత ప్రపంచంలో వేగంగా బ్రిడ్జ్ లను కడుతూ దైసుకుపోతోంది చైనా. అయితే తాజాగా ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతం ఎవరెస్ట్ కింద నుంచి రైలు మార్గం కోసం సొరంగాన్ని తవ్వాలని చైనా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మార్గం నిర్మాణంతో నేపాల్‌తో చైనాకి రైలు సదుపాయం ఏర్పడనుంది. ఇప్పటికే చైనా నుంచి టిబెట్‌కి రైలు మార్గం వుంది. ఖింఘాయ్ - లాసా రైల్వే మార్గాన్ని నేపాల్ వరకూ పొడిగించాలనే పథకానికి చైనా రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం నేపాల్ ప్రభుత్వంతో చైనా చర్చలు జరిపింది.

 చైనా ఏకంగా ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎవరెస్టు పర్వతాల కింద నుంచి నేపాల్కు సొరంగ రైలు మార్గం వేయాలనుకుంటోంది. 2020నాటికి దానిని పూర్తి చేయాలనుకుంటున్నట్లు అక్కడి స్థానిక పత్రిక ఒకటి పేర్కొంది. చైనా ఇప్పటికే టిబెట్ భూభాగం నుంచి సొంతం చేసుకున్న ఖోమోలాంగ్మా(ఎవరెస్టుకు టిబెట్లో పేరు) అనే ప్రాంతం నుంచి ఈ ప్రయోగానికి తెరతీయనుంది. ఈ మార్గాల్లో రైలుకు సరాసరి గంటకు 120 కిలో మీటర్ల వేగాన్ని అనుమతించనున్నట్లు వాంగ్ మెన్సూ అనే రైల్వే నిపుణుడు తెలిపాడు. 'ఈ ప్రాజెక్టు పూర్తయితే నేపాల్కు మరింత వేగంగా వ్యవసాయ ఉత్పత్తులు చేరవేస్తాం. ఇరు దేశాల మధ్య వర్తక వాణిజ్యం, పర్యాటకం పెరగడమే కాకుండా పౌర రవాణా సేవలు కూడా పెరుగుతాయి' అని వాంగ్ తెలిపారు. ఖాట్మండు విజ్ఞప్తి మేరకే ఈ పనిచేస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి చైనా ప్రపంచంలోనే అతి పెద్ద శిఖరంగా పేరు పొందిన ఎవరెస్ట్ ను తొవ్వి సొరంగం ద్వారా రైలు మార్గాన్ని నిర్మించాలని చూస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఎంత వరకు విజయం సాధిస్తాయో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : everest  mount  china  rail  track  way  khimghai  laasa  

Other Articles