యావత్ భారతం విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం వెనుక దాగివున్న కుట్రను ఎట్టకేలకు చత్తీస్ఘడ్ పోలీసుల రాబట్టారు. పోలీసుల అదుపులో వున్న సెమి ఉగ్రవాది వెల్లడించిన మేరకు వారు ప్రధాని నరేంద్ర మోదీ హత్యా యత్నానికి కుట్రపన్నినట్లు సమాచారం. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమీ) ఉగ్రవాది గుర్ఫాన్ వెల్లడిస్తున్న విషయాలు పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీని హత్య చేసేందుకు సిమి ప్లాన్ చేసి విఫలమైనట్లు సమాచారం. అంబికాపూర్ లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీని హత్యచేసేందుకు సిమీ కుట్ర పన్నినట్లు ఉగ్రవాది అంగీకరించాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తన పథకాలను అమలు చేయలేకపోయినట్టుగా గుర్ఫాన్ పోలీస్ విచారణలో అంగీకరించాడు.
రాష్ట్ర ఐజీ జేపీసింగ్ సమాచారం ప్రకారం ..జార్ఖండ్ పేలుళ్ళ సంఘటన తరువాత రాయ్‌పూర్ నుంచి పరారైన గుర్ఫాన్ అరేబియన్ సముద్రానికి సమీపంలో తలదాచుకున్నాడు. అక్కడ కొన్నాళ్లు కేర్ టేకర్‌గా పనిచేశాడు. అతను దుబాయ్‌లో ఉన్నపుడు అంతర్జాతీయ ఉగ్రవాది అబూ సలేంతో సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా మరి కొంతమంది సభ్యులను కలిసినట్టుగా అంగీకరించాడు. అంతేకాదు గుర్ఫాన్ సిమీ నేతల ఆధ్వర్యంలో నేపాల్‌లో జరిగిన న్యూ ఇయర్ గ్రాండ్ పార్టీకి కూడా హాజరైనట్టుగా పోలీసులు చెబుతున్నారు.
తన సహచరులు ఇజాయిద్దీన్, అస్లాం ను ఇండోర్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన తరువాత స్వయంగా గుర్ఫాన్ రాయ్‌పూర్ కోర్టులో లొంగిపోయాడు. అయితే గుర్ఫాన్ పోలీసుల విచారణకు సహకరిస్తున్నప్పటికీ, కీలక సమాచారాన్ని మాత్రం అందించడంలేదని ఐజీ వెల్లడించారు. జార్ఖండ్ పేలుళ్ల సూత్రధారులను తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నేరగాళ్లందరూ నేపాల్ లో అబు సలేం ఇచ్చిన పార్టీకి హాజరైయ్యారన్న సమాచారంతో వారిలో భారత్ కు చెందిన వారెవరెరు వున్నారన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more