చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై హైకోర్టు విచారణ చేసింది. పోలీసులకు కోర్టు ఝలక్ ఇచ్చింది. రీ పోస్టుమార్టానికి కోర్టు అనుమతి లభించకపోవచ్చు అనుకున్న పోలీస్ అధికారులకు షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్ట్. ఎన్కౌంటర్లో చనిపోయిన శశికుమార్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. చెన్నైలో ఫోరెన్సిక్ నిపుణులైన డాక్టర్ల బృందంతో వీలైనంత త్వరగా రీ పోస్టుమార్టం ప్రక్రియను పూర్తిచేయాలని సూచించింది. ప్రభుత్వ విచారణ పట్ల మృతుడు శశికుమార్ భార్య మునియమ్మళ్ అనుమానం వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ రోదిస్తూ న్యాయమూర్తిని ఆమె వేడుకున్నారు. అయితే.. శేషాచలం ఎన్కౌంటర్ మీద ప్రభుత్వ విచారణ పట్ల హైకోర్టు న్యాయమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నివేదికను ఎందుకు సమర్పించలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. సుప్రీం కోర్టు నిబంధనలకు లోబడి మృతదేహాలకు వీడియోగ్రఫీతో పోస్టుమార్టం నిర్వహించామని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. అనంతరం శేషాచలం ఎన్కౌంటర్ కేసును విచారించిన కోర్టు రీ పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది.
ఎన్ కౌంటర్‌కు సంబంధించిన ఎఫ్ఐఆర్ను, చనిపోయిన వ్యక్తుల శవపరీక్ష నివేదికలను సమర్పించాలని ఆంధ్ర ప్రదేశ్ సర్కార్‌ను గతంలోనే ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేశామంటూ ఏపీ ప్రభుత్వం తెలియజేయడంతో సిట్ దర్యాప్తును తామే మాని టరింగ్ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. తన భర్త మృతదేహానికి మరోసారి పోస్టు మార్టం నిర్వహించాలని మణియమ్మన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమెను ప్రతివాదిగా చేర్చాలని, కేసు విచారణలో ఆమె వాదనను కూడా హైకోర్టు విన్నది. మణియమ్మన్ విన్నపాన్ని హైకోర్ట్ స్వీకరించి, ఆమె భర్త మృతదేహానికి రీపోస్టుమార్టం చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. మరి చిత్తూర్ ఎన్ కౌంటర్ కేసులో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో ముందు ముందు చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more