తెలుగుదేశం పార్టీ మహానాడును గండిపేటలోని తెలుగు విజయం ప్రాంగణంలోనే నిర్వహించాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. తెలంగాణలోని పార్టీ శ్రేణుల్లో స్త్థెర్యం నింపడం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సిద్ధం కావడం కోసం గండిపేటలోనే మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనందున అక్కడ నిర్వహిస్తే బాగుంటుందని కొందరు నేతలు సూచించినా చివరకు హైదరాబాద్‌లోని గండిపేటనే ఖరారు చేశారు. ఎండల దృష్ట్యా రెండు రోజులకే పరిమితం చేయాలని కొందరు చెప్పగా చంద్రబాబు అంగీకరించలేదు. రాజకీయ కార్యక్రమాలు పెరగాల్సి ఉన్నందున మూడు రోజుల పాటు జరపాల్సిందేనని తెలిపారు. మే 27,28,29 తేదీల్లో మహానాడు జరగనుంది. తెదేపాను జాతీయ పార్టీగా చేసేందుకు అవసరమైన అధ్యయనం, కసరత్తు చేయడం కోసం యనమల రామకృష్ణుడు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పయ్యావుల కేశవ్‌లతో ఒక కమిటీని నియమించారు. తమిళనాడు, కర్ణాటక, అండమాన్-నికోబార్, మహారాష్ట్ర, ఒడిశాలలో పార్టీ సభ్యత్వ నమోదుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
తెలుగుదేశం పార్టీ ఎత్తులు ఇవే కావచ్చు..
*హైదరాబాద్ ఎలక్షన్స్
* హైదరాబాద్ లో మహానాడు పెడితే ఏపి, తెలంగాణల నుండి భారీగా కార్యకర్తలు హైదరాబాద్ చేరుకుంటారు. కాబట్టి తెలంగాణ క్యాడర్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.
* తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నుండి టిఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీని పక్క రాష్ట్రం పార్టీగా సంబోదిస్తోంది. కాబట్టి దాన్ని మార్చాలన్న ఉద్దేశం
*తెలంగాణ నేతలు కేసీఆర్ దూకుడు ముందు రానించలేకపోతున్నారు. టిడిపి నేతలను అన్ని రకాలుగా కట్టడి చేస్తున్నాడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ పై టిడిపి నేతలు పోరాడేలా కొత్త ఉత్సాహాన్ని నింపడానికి
* ఏపిలొ పార్టీ ఎలాగూ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ పెద్దగా మహానాడు నిర్వహించాల్సిన అవసరం లేదు.
* టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించింది కాబట్టి ఆ సభకు పోటీగా మహానాడు నిర్వహించి తెలంగాణలో తమ సత్తా చాటాలని
//అభినవచారి//
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more