ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఏడో రోజుకు చేరింది. తెలంగాణ ప్రభుత్వం కనీసం చర్చలు జరిపి, కేబినెట్ సబ్ కమిటిని నియమించింది. కానీ ఏపిలో మాత్రం పరిస్థితి ఏం మారలేదు. కేవలం 27 శాతం మాత్రమే ఫిట్ మెంట్ ఇస్తామని అక్కడి మంత్రులు ఖరాఖండిగా చెప్పేశారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు 40 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆర్టీసీ సమ్మెపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మరోవైపు హైకోర్టు మధ్యంతర తీర్పును సవాల్ చేస్తూ కార్మిక సంఘాలు మంగళవారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నాయి.
తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ 39 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం ఫిట్‌మెంట్‌ను 39 శాతంగా నిర్ణయించినప్పటికీ సీఎం కేసీఆర్‌తో జరిగే భేటీలో అది 40 శాతంగా ఖరారు కావచ్చునని సమాచారం. సమ్మె పరిష్కారం అవుతుందన్న నమ్మకాన్ని సబ్ కమిటీ సభ్యులు వ్యక్తం చేశారు. అవసరమైతే కార్మిక సంఘాల నేతలతో కేసీఆరే స్వయంగా చర్చలు జరుపుతారని నాయిని నర్వింహారెడ్డి చెప్పారు. అయితే మరోపక్క తెలంగాణలో ఆర్టీసీ బస్సులను రోడ్డెక్కించడానికి తెలంగాణ సర్కార్ ప్రయత్నాలను సాగిస్తోంది. అందులో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘం నాయకుడు, తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీష్ రావ్ తో కేసీఆర్ మంతనాలు జరపనున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఎంత మేర ఫిట్ మెంట్ ఇవ్వాలి.. ఒకవేళ ఫిట్ మెంట్ తర్వాత ఆర్థిక భారాన్ని ఎలా భర్తీ చెయ్యాలన్నదానిపై ఇద్దరు సమాలోచనలు జరపనున్నారని సమాచారం. మొత్తానికి నేటితో తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెర దించాలని తెలంగాణ సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more