Jalalitha CM swearing ceremony cancel | opposition parties appeal | supreme court of india

Jalalitha cm swearing ceremony cancel opposition parties appeal

jayalalitha news, tamilnadu news, jayalalitha crime news, jayalalitha updates, jayalalitha assets case, jayalalitha controversy, jayalalitha photos, jayalalitha case, karnataka high court, supreme court of india, anna dmk news

Jalalitha CM swearing ceremony cancel opposition parties appeal : Anna DMK party officials saying that jayalalitha is not taking swearing of Cm post in tamilnadu due to pressure of opposition parties appeal.

‘అప్పీలు’ డిమాండ్లతో ‘సీఎం’గా జయ ప్రమాణస్వీకారం రద్దు

Posted: 05/14/2015 10:55 AM IST
Jalalitha cm swearing ceremony cancel opposition parties appeal

19 ఏళ్లపాటు సాగిన అక్రమాస్తుల కేసు విచారణలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను కర్నాటక కోర్టు నిర్దోషిగా ఇటీవలే తీర్పునిచ్చింది. దీంతో ‘అమ్మ’ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఏకంగా సంబరాలే నిర్వహించారు. ఇక జయ త్వరలోనే ‘సీఎం’గా బాధ్యతలు చేపట్టున్నారన్న ఆనందంలో మునిగిపోయారు. ఈనెల 17వ తేదీన సీఎంగా జయ ప్రమాణస్వీకారం చేస్తారని అన్నాడీఎంకే పార్టీవర్గాలు తెలిపాయి. అయితే.. ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ నెల 15న శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని భావించిన పార్టీ నేతలు తాజాగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. 17న సీఎంగా జయ ప్రమాణస్వీకారం ఉండదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలంటూ రాజకీయ పక్షాల డిమాండ్ పెరుగుతుండడమే జయ ప్రమాణస్వీకారానికి ప్రతిష్టంభన నెలకొందని తెలుస్తోంది. జయలలితను నిర్దోషిగా వెల్లడించిన కర్నాటక హైకోర్టు తీర్పుకు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం చెప్పారు. అటు.. 19 ఏళ్లపాటు సాగిన విచారణలో జయ దోషి అని రుజువైతే, 3 నిమిషాల తీర్పుతో ఆమె నిర్దోషి అని ప్రకటించారని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ తప్పుపట్టారు. తీర్పును సవరిస్తేనే అవినీతి నిర్మూలన సాధ్యమని పీఎంకే అధినేత రాందాస్ అన్నారు. ఇలా ప్రతిపక్షాల ‘అప్పీలు’ డిమాండ్లు పెరగడంతో జయ సీఎం ప్రమాణస్వీకారాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా.. అక్రమాస్తుల కేసు నుంచి జయ బయటపడినప్పటికీ ఇంతవరకు ఉత్సాహంతో ప్రజల ముందుకు రాలేదు. కోర్టు తీర్పుపై విమర్శలు రావడం, అప్పీలుకు విపక్షాలు పట్టుపట్టడం, తీర్పు వెలువరించిన న్యాయమూర్తి కుమారస్వామి సైతం విమర్శలకు స్పందించి అత్యవసరంగా సమావేశం కావడం జయలలితను ఆందోళనకు గురిచేసింది. తీర్పు వివరాలను న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే సీఎం పదవి చేపట్టడంపై ఆమె నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha news  anna dmk party  supreme court  

Other Articles