Bombay HC granted bail Salman Khans travel plea to dubai | Salman

Bombay hc granted bail salman khans travel plea to dubai

bombay high court, salman khan, salman khan dubai tour, salman khan movies, bombay court, salman khan hit and run case

Bombay HC granted bail Salman Khans travel plea to dubai : Actor Salman Khan's plea for permission to travel abroad to Dubai for an event will be heard on Tuesday by a single judge vacation bench of the Bombay high court.

కోర్టు బెల్లు మోగిందోలేదో.. అప్పుడే సల్లూ ‘Bye Bye’!

Posted: 05/26/2015 01:57 PM IST
Bombay hc granted bail salman khans travel plea to dubai

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా వున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 18 ఏళ్లుగా కొనసాగిన హిట్ అండ్ రన్ కేసు నుంచి విముక్తి పొందిన ఈ హీరోకి.. మరో వ్యవహారంలో కోర్టు బెల్లు మోగించేసింది. అంతే! కోర్టు బెల్లు మోగిందోలేదో.. అప్పుడే సల్లూ ‘Bye Bye’ అంటూ దుబాయ్ కి పయనమయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే.. హిట్ అండ్ రన్ కేసులో దోషిగా నిర్ధారణ అయ్యి శిక్షపడిన అనంతరం, అతడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన వ్యవహారం తెలిసిందే! సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల శిక్ష తీర్పును కొట్టివేస్తూ.. సల్లూకి విముక్తి కలిగింది. అయితే.. కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదనే నిబంధన మాత్రం విధించింది. అంటే.. సల్లూ షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి వస్తే.. ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనన్నమాట!

ఈ నేపథ్యంలోనే మే 29న  జరగనున్న షో కోసం దుబాయ్ వెళ్లడానికి అనుమతిని కోరుతూ హైకోర్టులో సల్మాన్ పిటిషన్ దాఖలు చేశాడు. అతడు వేసిన ఆ పిటిషన్ ను కోర్టు పరిశీలించిన అనంతరం  దుబాయ్ వెళ్లేందుకు అనుమతి మంజూరుచేస్తూ ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా అనూహ్యంగా బెయిల్ లభించడంతో ఈ దబాంగ్ హీరో తన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి పనిలో తలమునకలై ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bombay high court  salman khan  dubai tour  

Other Articles