Pankaj parakh, Maharastra, Gold shirt

Maharashtra corporator pankaj parakh appear in a golden shirt at hyderabad

Pankaj parakh, Maharastra, Gold shirt

Maharashtra Corporator Pankaj Parakh appear in a Golden Shirt at hyderabad. Prakash parakh attend a function in himayathsagar at hyderabad.

ITEMVIDEOS: అతడి ఒళ్లంతా బంగారమే

Posted: 06/05/2015 08:36 AM IST
Maharashtra corporator pankaj parakh appear in a golden shirt at hyderabad

బంగారం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ఇక ఆడవాళ్లకు బంగారం అంటే ఎంత పిచ్చో అందరికి తెలుసు. కనీసం మాసమైనా బంగారం ఒంటి మీద ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ ఒకవేళ ఒకటి కాదు రెండు కాదు నాలుగు కేజీల బంగారం ఒంటి మీద ఉంటే ఎలా ఫీలవుతారు..? అది కూడా ఓ షర్టులాగా ఉంటే ఎలా ఉంటుంది..? ఏంటీ ఇదేదో క్విజ్ పోటీలో ప్రశ్నలు అడిగినట్లు ఉందనుకుంటున్నారా..? కానీ నిజం. మహారాష్ట్రలోని యోలో పట్టణానికి చెందిన పంకజ్ పరేఖ్ అనే వ్యాపారవేత్త బంగారు షర్టులతో కనిపించారు. మొత్తానికి నడుస్తున్న బంగారు దుకాణంలా ఒంటి మీద నాలుగు కేజీలత బంగారంతో పంకజ్ అందరిని ఆకట్టుకున్నారు. 30 గ్రాముల బంగారంతో రూపొందిన కళ్లద్దాలు. మెడకు నెక్లెస్‌లు, చేతి వేళ్లకు ఉంగరాలతో సహా పంకజ్ తన ఒంటినిండా ఏడు కేజీల 30 గ్రాముల బంగారం దింపేశారు.

వీటి విలువ సుమారుగా రూ.3 కోట్లు ఉంటుందట.  హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని సోదరుడు ప్రదీప్ పరేఖ్ గృహప్రవేశానికి పంకజ్ వచ్చారు. గృహప్రవేశానికి వచ్చిన వారంతా పంకజ్ బంగారు చొక్కాకు ముగ్దులయ్యారు మరి. ఇక మీడియా వాళ్లయితే పంకజ్ ఎక్కడికి వెళ్లినా వెంట వెళ్లారు. చిన్నప్పటి నుంచి తనకు బంగారం అంటే ఎంతో ఇష్టమని, అందుకే ఇలా ఒళ్లంతా బంగారు ఆభరణాలను వేసుకున్నట్లు చెప్పారు. త్వరలో పుత్తడి ప్యాంట్ కూడా కుట్టించుకొని గిన్నిస్ బుక్‌లో స్థానం కోసం దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు. మొత్తానికి ఒళ్లంతా బంగారంతో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారారు పంకజ్.

*అభిరనవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pankaj parakh  Maharastra  Gold shirt  

Other Articles