YSjagan,Chandrababu, Assets, Corruption

Ys jagan mohan reddy attacked on narachandrababu naidu for corrupation

YSjagan,Chandrababu, Assets, Corruption

YS jagan mohan reddy attacked on narachandrababu naidu for corrupation. But jagan already jailed for over assets.

మోసగాడు ఎవరు జగన్..?

Posted: 06/05/2015 11:07 AM IST
Ys jagan mohan reddy attacked on narachandrababu naidu for corrupation

మోసగాళ్లకు మోసగాడు సినిమా తెలుగులో సూపర్ హిట్. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మోసగాళ్లకు మోసగాళ్లు పెరిగిపోయారు. అవును తెలుగు రాష్ట్రాల్లో ఒకరికి మించిన వాళ్లు ఒకరు తయారవుతున్నారు. ఒకరేమో అక్రమాస్తులు సంపాదించి ఏకంగా సిబిఐ అదికారులకు కళ్లు చెదిరేగా ఆస్తులు కూడగట్టారు. చాలా కాలం జైలు జీవితం కూడా అనుభవించారు. కానీ ఇప్పుడు మాత్రం అవినీతి మరకలు అంటని వాడిలాగా నీతి వాఖ్యాలు వల్లిస్తున్నారు. అసలు నారా చంద్రబాబు నాయుడు పుట్టుకే అవినీతి పుట్టుక అదీ.. ఇదీ అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. ఇక అవి చాలవు అన్నట్లు సీడీలు, బుక్కులు, ఇంకా వీలైతే టీషర్టులు కూడా విడుదల చేసేలా ఉన్నారు. అయినా చంద్రబాబు బాగోతం ఇదీ అంటూ కొత్తగా బుక్కు తీసిన జగన్ కు సిబిఐ ఎప్పుడో పేజీలకు పేజీల బుక్కు రాసింది. ఇక అవినీతి మీద జగన్ ను పోటీగా నిలిపితే మాత్రం రికార్డు స్థాయి గెలుపుఖాయం. మరి అలాంటి జగన్ ఇప్పుడు మాత్రం చిలుక పలుకులు పలకడం కొంచెమైనా కరెక్ట్ అనిపిస్తుందా మరి..!

* వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించింది జగన్ కాదా..?
* తండ్రి అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని అక్రమాస్తులు కూడబెట్టలేదా..?
* సిబిఐ అధికారులే నివ్వరబోయే ఆస్తులు జగన్ సొంతం కాదా.?
* అవినీతి అన్న పదానికి పుట్టినిల్లు వైయస్ జగన్ ఇల్లు కాదా..?
* ఎన్నికల సమయంలో వేల కోట్లు, మద్యం పారించింది ఇదే జగన్ కాదా..?
* గతంలోనే చంద్రబాబు మీద కేసులు పెట్టి విఫలమైంది జగన్ ఫ్యామిలీ కాదా?
* తాజాగా ఏపిలో అధికారంలోకి వచ్చినా అవినీతి చెయ్యదు అన్న నమ్మకం ఉందా?

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : YSjagan  Chandrababu  Assets  Corruption  

Other Articles