Revanth reddy | got | bail

Revanth reddy got bail

Revanth reddy got bail, vote for cash, Revanth reddy, bail, Court, TDP, TTDP, revanth reddy updates, Telugudesamparty, Chandrababu naidu, ACB, telangana, KCR

Revanth reddy got bail. IN note for vote scandal RevanthReddy finally got bail. After ten days Revanth Reddy out now. Court pronounce bail to Revanth.

ఫ్లాష్..ష్లాష్.. రేవంత్ రెడ్డికి బెయిల్

Posted: 06/10/2015 03:46 PM IST
Revanth reddy got bail

ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ చేత ఇంటరాగేషన్ ఎదుర్కొన్న రేవంత్ రెడ్డికి మధ్యంతర బెయిల్ దొరికింది.  రేవంత్ రెడ్డికి బెయిల్ కోసం ఎంతో ప్రయత్నాలు సాగుతున్నా ఇప్పటికి బెయిల్ దొరికింది. అయితే రేవంత్ కూతురు నిశ్చితార్థం రేపే కావడంతో కనీసం మధ్యంతర బెయిల్ కోసం రేవంత్ తరఫున లాయర్లు కోర్టును కోరారు. కాగా దీనిపై ఏసీబీ కూడా ఎలాంటి అడ్డుచెప్పడం లేదు. కానీ బెయిల్ మీద విడుదల తర్వాత మాత్రం సభలు, సమావేశాలు జరపడానికి మాత్రం వీలుకల్పించకూడదలని ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. బెయిల్ కోసం ముందు నుండి ప్రయత్నాలు సాగుతున్న ఎలాంటి ఫలితం రాకపోవడంతో కనీసం నిశ్చితార్థం కోసం మధ్యంతన బెయిల్ సంపాదించాలని రేవంత్ బంధువులు కోరినట్లు సమాచారం. అయితే బెయిల్ పిటిషన్ తో పాటుగా రేవంత్ కూతురి నిశ్చితార్థ శుభలేఖను కూడా కోర్టుకు సమర్పించారు.


కోర్టులొ ఏం జరిగింది...

* అంతకు ముందు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్ పై రేవంత్ రెడ్డి తరఫున లాయర్లు వాదనలు మొదలుపెట్టారు.
* తమ క్లైంట్ నిర్దోశి అని తెలంగాణ ప్రభుత్వం కావాలనే కేసులో ఇరికించిందని లాయర్లు వాదించారు.
* తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందు వల్లే ఇలా చేశారని అన్నారు.
* రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం కూడా ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోరారు.
* స్టీఫెన్ సన్ గతనెల 28 న ఫిర్యాదు చేస్తే 31 న కేసు నమోదు చెయ్యడంపై లాయర్లు ప్రశ్నించారు.
* ఇందలో కుట్ర కోణం దాగుందని రేవంత్ తరఫున లాయర్లు వాదించారు.
* అయితే ఏసీబీ తరఫు లాయర్లు మాత్రం దీన్ని ఖండించారు.
* ఎవరి కుట్ర లేదని, స్వచ్చందంగా, స్వేచ్ఛగా కేసు నడుస్తోందని అన్నారు.
* రేవంత్ కు బెయిల్ ఇవ్వడంపై ఏసీబీ తరఫున లాయర్లు అడ్డుచెప్పారు. కానీ ఒకరోజు బెయిల్ కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
* అయితే బెయిల్ మీద బయటకు వెళితే సాక్షులను తారుమారు చేసే అవకాశ:, సాక్షాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున ఎలాంటి మీటింగ్ లు జరగకుండా చూడాలని కోర్టును కోరారు.
* రెండు పక్షాల వాదనను విన్న కోర్టు తీర్పును మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
*ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే బెయిల్
* 12 గంటల బెయిల్ మంజూరు చేసిన కోర్టు
* పూర్తి స్థాయి బెయిల్ పై తోసిపుచ్చిన కోర్టు
* కుమార్తె నిశ్చితార్థానికి వెళ్లేందుకు రేవంత్ కు అవకాశం
//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth reddy  bail  Court  TDP  TTDP  revanth reddy updates  Telugudesamparty  Chandrababu naidu  ACB  telangana  KCR  

Other Articles