AP | Tnews | Notices | Police

Ap police issued kcrs channel t news in the mid night

ap, police, Tnews, KCR, Telangana, Cash for vote case

Ap police issued KCRs channel T news in the mid night. Ap police issued notices in the midnight to Tnews for broadcasting false news in the news chennels.

ITEMVIDEOS: టీన్యూస్ కు నోటీసులు..

Posted: 06/20/2015 07:34 AM IST
Ap police issued kcrs channel t news in the mid night

ఓటుకు నోటు వ్యవహారంలో కేసు మలుపులు తిరుగుతోంది. అయితే కేసు సంగతి ఎలా ఉన్నా తాజాగా టీ న్యూస్ చానల్ కు నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఇది ఏపి ప్రభుత్వం పెట్టిన కేసుకు సంబందించిన కేసులో అందిన నోటీసులు కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత చానల్‌ టీ-న్యూస్‌ చానల్‌కు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ అర్ధరాత్రి సమయంలో  టీ ఛానల్ వద్ద సంచలనం చోటు చేసుకుంది. ఈనెల 7వ తేదీన చంద్రబాబు-స్టీఫెన్‌సన్‌ మధ్య జరిగిన సంభాషణ ‘టీ-న్యూస్‌’లోనే మొట్టమొదటిసారిగా ప్రసారమైంది. దీనిపై విశాఖపట్నంలో ఎన్‌వీవీ ప్రసాద్‌ అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి 11.45 గంటలకు విశాఖపట్నం ఏసీపీ రమణ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10లోని టీ-న్యూస్‌ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. నేరుగా చానల్‌ కార్యాలయంలోకి వెళ్లారు. చానల్‌ సీఈవో నారాయణ రెడ్డికి నోటీసులు అందించారు. కేబుల్‌ నెట్‌వర్క్‌ నియంత్రణ చట్టంలోని సెక్షన్‌ 19 ప్రకారం నోటీసు జారీ చేస్తున్నామని.. టీ న్యూస్ చానల్‌ ప్రోగ్రామ్‌ కోడ్‌ను ఉల్లంఘించిందని అన్నారు. పరువు నష్టం కలిగించేలా తప్పుడు, అర్ధసత్యాలతో కూడిన కథనాలను ప్రసారం చేసింది. ఈనెల 7వ తేదీ రాత్రి 8.30 గంటలకు టీ న్యూస్ చానల్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రసారమైన కార్యక్రమానికి సంబంధించి చట్టబద్ధమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠను దిగజార్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌, వైసీపీ నేత జగన్‌, నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌, టీ-ఏసీబీ అధికారులు, సాక్షి, టీన్యూస్‌ చానళ్లు ప్రయత్నిస్తున్నాయని ఎన్‌వీవీ ప్రసాద్‌ అనే న్యాయవాది ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ పోలీసులు రంగంలోకి దిగారు. నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నిరంకుశ వైఖరి నశించాలని.. చంద్రబాబు డౌన్‌ డౌన్‌ అని నినాదాలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీలో నమోదైన కేసులపై ఏర్పాటైన సిట్‌ శుక్రవారమే తొలిసారి భేటీ అయ్యిన తర్వాత  టీ-న్యూస్‌కు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేయడం గమనార్హం. తెలంగాణకు చెందిన ఒకరిద్దరు ఐపీఎస్‌ అధికారులకు కూడా నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  police  Tnews  KCR  Telangana  Cash for vote case  

Other Articles