Telangana | ACB | Leave | Officers | cash for vote case

Telangana acb officers who participated key roles in the cash for vote case are in leave

Telangana, ACB, Leave, Officers, cash for vote case

Telangana ACB officers who participated key roles in the cash for vote case are in leave. The Telangana Main ACB officers on leave. Telangana Home secretry Burra Venkatesham leave.

ఓటుకు నోటు కేసు అధికారుల సెలవు

Posted: 06/23/2015 09:27 AM IST
Telangana acb officers who participated key roles in the cash for vote case are in leave

అది మామూలు కేసు కాదు. ఇద్దరు వ్యక్తులకు చెందిన తగాదా అని కొందరు.. రెండు రాష్ట్రాల మధ్య నడుస్తున్న గొడవ అని కొందరు.. రాజకీయ నాటకాలు అని మరి కొందరు ఇలా ఎవరికి నచ్చినట్లు వారు రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు ఎఎంత దుమారాన్ని రేపిందో అందరికి తెలుసు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అయితే ఓ నాలుగు రోజుల తర్వాత ఇదే వ్యవహారంపై చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాటల్ాడినట్లు ఆడియో టేపులు విడుదలయ్యాయి. దాంతో పార్టీల గొడవ కాస్తా ప్రాంతాల గొడవగా మారింది. తెలంగాణ ఏసీబీ అధికారులు ఎంతో కట్టుదిట్టంగా సాక్షాధారాలతో సహా కేసును విచారించడంతో కేసు బలంగా తయారైంది. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. ఏం జరిగింది అంటారా..? అయితే చదవండి

ఓటుకు నోటు వ్యవహారంలో పరోక్షంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఒక్కొక్కరుగా సెలవు బాట పడుతున్నారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి ఇప్పటికే విదేశీ పర్యటనలో ఉండగా... కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సజ్జనార్‌ కొన్నాళ్లపాటు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఇదే సమయంలో... తెలంగాణ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈనెల 20న సెలవుపై వెళ్లారు. జూలై 9 వరకు ఆయన సెలవులోనే ఉంటారు. శివధర్‌ రెడ్డి తిరిగి వచ్చాక హైదరాబాద్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి కూడా విదేశీ బాటపట్టనున్నట్లు సమాచారం. అధికారుల విదేశీ పర్యటనలపై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తుండగా... ఇవన్నీ ముందుగానే ఖరారైన పర్యటనలని అధికారులు చెబుతున్నారు. అయినా కీలక దశలో ఉన్న ఓటుకు నోటు వ్యవహారంలో ఇలా అధికారులు విదేశీ పర్యటనల పేరుతో వెళ్లడంపై సర్వత్రా అనుమనాలు కలుగుతున్నాయి.

*లభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  ACB  Leave  Officers  cash for vote case  

Other Articles