Govt | Tax | Benefits | credit | Debit cards | Payment

Govt proposes tax benefits for credit and debit card payments

Govt, Tax, Benefits, credit, Debit cards, Payment

The central government came out with a raft of proposals to encourage electronic transactions, including income tax benefits for payments made through debit or credit cards, a move aimed at cracking down on black money

కార్డ్ వాడితే లాభాలే.. కేంద్రం కొత్త ప్రతిపాదన

Posted: 06/23/2015 11:02 AM IST
Govt proposes tax benefits for credit and debit card payments

బ్లాక్ మనీకి దేశంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కానీ అడ్డుకట్ట పడటం లేదు. అయితే రిజర్వ్ బ్యాంక్ తన పరిధిలో ఉన్నంత వరకు చర్యలు తీసుకుంటుండగా తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. అయితే పరోక్షంగా నల్లధనానికి అడ్డుకట్టు వేస్తూనే భారత్ ను నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా తయారు చెయ్యడానికి పన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వాడకంపై లాభాలను కూడా అందించడానికి సిద్దమైంది. అంతేకాదు కార్డు ద్వారా పెట్రోల్, గ్యాస్ కొనుగోలు ఇంకా రైల్వే టిక్కెట్ల బుకింగ్ చేసినవారికి లావాదేవీ రుసుము మినహాయించాలని ప్రతిపాదించింది.ఇకపై రూ.లక్షకు మించిన లావాదేవీలను తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జరుపాలని ముసాయిదా పత్రంలో పేర్కొంది. ఈనెల 29లోగా ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని కేంద్రం కోరుతున్నది. తద్వారా పన్ను ఎగవేత, నకిలీ కరెన్సీ బెడద తగ్గుతుందని, అందరికీ రుణ సదుపాయం అందుబాటులోకి వస్తుందని, దేశంలో ఆర్థిక సమ్మిళితాభివృద్ధి పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తున్నది.

tax-facilities

భారత్‌ను నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు నడుం బిగించిన కేంద్రం.. ఈ దిశగా కొన్ని ప్రతిపాదిత చర్యలతో చర్చా పత్రాన్ని విడుదల చేసింది. అందులోని ముఖ్య ప్రతిపాదనలు..
- పెట్రోల్, గ్యాస్, రైల్ టిక్కెట్ల కొనుగోలుపై లావాదేవీ చార్జీల ఎత్తివేత
- లక్ష దాటిన ట్రాన్సాక్షన్లు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే..
- నగదు రహిత ఆర్థిక వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు
- కరెంట్, గ్యాస్, ఇంటర్నెట్ కనెక్షన్ చార్జీలతోపాటు ఇతర యుటిలిటీ సేవల బిల్లులన్నీ ఎలక్ట్రానిక్ రూపంలోనే జరిపేలా చర్యలు
- మొత్తం చెల్లింపుల్లో కనీసం 50 శాతం డెబిట్, క్రెడిట్ ద్వారానే స్వీకరించే వర్తకులకు సైతం పన్ను రాయితీ కల్పించాలని నిర్ణయం
- వ్యాపారులు కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై వ్యాట్‌లో 1-2 శాతం రిబేటు ఇవ్వాలనుకుంటున్నది

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Govt  Tax  Benefits  credit  Debit cards  Payment  

Other Articles