తనకు అండగా ఉంటానని టీఆర్ఎస్లోకి వచ్చిన డీఎస్‌కు ఓ తమ్ముడిలా తాను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాని, అతనికి మనస్పూర్తిగా సెల్యూట్ చేస్తున్నానని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. డీఎస్ టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేసీఆర్ప్రసంగిస్తూ.. డీఎస్‌తో తనకు 35 ఏళ్ల నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. తనకు, డీఎస్ లాంటి వ్యక్తికి పదవులు లెక్క కాదన్నారు. తాము ఎన్ని పదవులు అనుభవించలేదు. పదవులు అనేవి శాశ్వతం కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వంచేతల ప్రభుత్వమనే భావనతోనే డీఎస్ మాతో కలిశారు. ప్రతీ విషయంలోనూ డీఎస్‌కు సంపూర్ణ అవగాహన ఉంది. డీఎస్ సూచనలు, సలహాలతో ముందుకెళ్దామని చెప్పారు.
డీఎస్ చేరికను నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఆహ్వానించారన్నారు. డీఎస్ చేరికపై పోచారంతో పాటు ఎమ్మెల్యేలను సంప్రదించగా.. మంచి నిర్ణయమని చెప్పారన్నారు. డీఎస్ లాంటి వ్యక్తులు పార్టీలోకి వస్తు తమకు పెద్ద దిక్కుగాఉంటారని పార్టీ నేతలు అన్నారని కేసీఆర్ చెప్పారు. ఉద్యమ సమయంలో డీఎస్ తనతో టచ్‌లో ఉండి అన్ని సమస్యలపై మాట్లాడేవారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు డీఎస్ ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. డీఎస్ సంస్కారం గల వ్యక్తని..చిల్లరమల్లరగా మాట్లాడే అలవాటు ఆయనకు లేదన్నారు. అలాంటి వ్యక్తి పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. ఆయనను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు.
అంతకుముందు టీఆర్ఎష్ లో చేరిన డి.శ్రీనివాస్ మాట్టాడుతూ.. పార్టీ మారుతున్నానని ప్రకటించిన నాటి నుంచి తనను పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు.. వారిని తాను విమర్శించదలుచుకోలేదని డీఎస్ స్పష్టం చేశారు. తన ఆత్మప్రబోధాను సారం నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తాను బీ-ఫారం ఇస్తే గెలిచిన ఇవాళ తననే తిడుతున్నారు. వారికి సమాధానం చెప్పాల్సిన అసవరం లేదు. తన వెంబడి వచ్చిన ప్రతీ నేతకు, కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పారు. బంగారు తెలంగాణలో తన వంతు పాత్ర పోషిస్తానని తెలిపారు. ఇబ్బందికర పరిస్థితిలో బాగా ఆలోచించి టీఆర్ఎస్లో చేరేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చిందని ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారని... ఆ తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఉద్యమం చేపట్టి తెలంగాణ సాధించారని ఆయన అన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more