ACB | Telangana | Jimmi | Section 41(A) |Sandra | Cash for vote case, custody, court, Revanth Reddy

Telangana acb issued notices under section 41a to jimmi in the case of cash for vote

ACB, Telangana, Jimmi, Section 41(A),Sandra, Cash for vote case, custody, court, Revanth Reddy

Telangana ACB issued notices under section 41a to Jimmi in the case of cash for vote. Already Sandra took notices three days back and acb took custody through court.

ఓటుకు నోటు కేసులో ఇక జిమ్మి అరెస్టుకు సిద్దం..!

Posted: 07/09/2015 08:05 AM IST
Telangana acb issued notices under section 41a to jimmi in the case of cash for vote

ఓటుకు నోటు కేసు రెండో ఎపిసోడ్‌లో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీ మరో అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తోపాటు మరికొంత మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి జిమ్మీబాబు స్కెచ్ వేశాడని ఏసీబీ దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. విచారణకు హాజరుకావాలని సండ్రతోపాటు జిమ్మీబాబుకు కూడా సెక్షన్ 41(ఏ)ప్రకారం ఏసీబీ అదనపు ఎస్పీ మల్లారెడ్డి నోటీసులు జారీచేశారు. ఈనెల 6న సాయంత్రం ఐదు గంటలలోపు ఏసీబీ ఎదుట హాజరుకావాల్సిన జిమ్మీ ఇంతవరకు ఆచూకీ లేడు. అదేరోజు విచారణకు హాజరైన సండ్రను ఏసీబీ అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ పరిణామాలన్నింటినీ హైదరాబాద్‌లో ఉండి గమనించిన జిమ్మీ తనను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో విజయవాడ పారిపోయినట్టు టీడీపీ వర్గాల ద్వారా తెలసింది.

Also Read:  ఓటుకు నోటు కేసులో జిమ్మీకి నోటీసులు.. ఎవరీ జిమ్మీ..

ఓటుకు నోటు కేసులో రేవంత్, సండ్ర తదితరులతో కలిసి కీలకపాత్ర పోషించిన జిమ్మీని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్టు విశ్వసనీయ సమాచారం. రేవంత్ జైల్లో ఉన్న నెలరోజులు జిమ్మీ విజయవాడ, గుంటూరులో తలదాచుకున్నాడు. రేవంత్‌కు బెయిల్ వచ్చిన రోజే తిరిగివచ్చి హైదరాబాద్‌లో ర్యాలీలో పాల్గొన్నాడు. తాజాగా తనకు నోటీసులు జారీకావడం, సండ్ర అరెస్టవడంతో జిమ్మీబాబు మళ్లీ విజయవాడ పారిపోయాడని ఏసీబీ అనుమానిస్తున్నది. ఈ కేసులో చార్జిషీట్ దాఖలుకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. దీనితో జిమ్మీని ఎలాగైనా పట్టుకొని విచారించాలన్న పట్టుదలతో ఏసీబీ ఉన్నట్టు తెలిసింది. టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఏసీబీలోని పలువురు అధికారులు, సిబ్బందితో కలిసి రెండు బృందాలను జిమ్మీ వేటకు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. జిమ్మీబాబును అప్పగించేలా అవసరమైతే ఏపీ పోలీస్‌శాఖకు అధికారికంగా లేఖ రాయాలని ఏసీబీ ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ ఏపీ అధికారులు స్పందించకపోతే తామే స్వయంగా వెళ్లి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తామని ఓ కీలక అధికారి స్పష్టంచేశారు.

By Abhinavachary

Also Read:  సండ్రకు కస్టడీ.. ఐదు కాదు రెండు రోజులే
Also Read :  చేసింది మొత్తం సండ్రనే.. ఇవిగో ఫోన్ సంభాషణలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ACB  Telangana  Jimmi  Section 41(A)  Sandra  Cash for vote case  custody  court  Revanth Reddy  

Other Articles