‘ప్రేమ’ అనే అద్భుతమైన భావనను నేటి యువతరం అప్రతిష్టపాలు చేస్తున్నారు. కేవలం లైంగిక ఆనందాన్ని పొందడం కోసం కొందరు ఆకతాయిలు అమ్మాయిల్ని తమ ట్రాప్ లో పడేసి.. మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఇటువంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ తరహాలోనే మరో సంఘటన చోటు చేసుకుంది. ఫేస్ బుక్ ద్వారా ఓ అమ్మాయిని పరిచయం చేసుకున్న ఓ యువకుడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మొహం చాటేసి ఇప్పుడు కటకటాల వెనక ఊచలు లెక్కిస్తున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా వత్సాయి మండలం కంభంపాడుకు చెందిన రమేష్ (24) అనే యువకుడు బీటెక్ పూర్తిచేసి చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీనగర్ లో వుంటున్నాడు. ఇతనికి ఫేస్ బుక్ ద్వారా గుంటూరుజిల్లా అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామానికి చెందిన వెనిగల్ల పూజిత (19) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత వారిమధ్య పరిచయం ప్రేమగా మారింది. దీంతో రమేష్ తనని పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మించి.. హైదరాబాద్ కు రప్పించాడు. అతని మాయమాటల్లో పడిన ఆ అమ్మాయి.. గతనెల 25న సికింద్రాబాద్ ట్రైన్ లో వచ్చింది. రమేష్ ఆమెను తాను వుంటున్న గదికి తీసుకెళ్లి.. మూడురోజులపాటు వుంచుకున్నాడు. తర్వాత ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పి వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెను తిరిగి ఇంటికి పంపించేశాడు.
అంతే! అప్పటినుంచి పూజిత ఎన్నిసార్లు ఫోన్ చేసిన రమేష్ నుంచి ఎటువంటి స్పందన లభించలేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న ఆమె.. జరిగిన ఉదంతాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. కుటుంబసభ్యులు అంతా కలిసి హైదరాబాద్ లో రమేష్ నివసిస్తున్న గదికి వెళ్లి అతనిని నిలదీశారు. అయితే.. తాను వివాహం చేసుకోనని చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. గురువారం రమేష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ కోటయ్య తెలిపారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more