AICC vice president caught with drugs in america says bjp leader subramanya swamy | Congress controversies

Aicc vice president caught with drugs in america subramanya swamy controversies

rahul gandhi, subramanya swamy, aicc vice president rahul, rahul gandhi controversies, rahul gandhi drugs, bjp party

AICC vice president caught with drugs in america subramanya swamy controversies : Bjp senior leader subramanya swamy says that aicc vice president caught with drugs in america.

డ్రగ్స్ తో పట్టుబడిన రాహుల్ గాంధీ..?

Posted: 07/22/2015 11:48 AM IST
Aicc vice president caught with drugs in america subramanya swamy controversies

రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసే ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే క్రమశిక్షణ కోల్పోయాడు. చూడ్డానికి ఎంతో అమాయకంగా కనిపించే ఈ నాయకుడు అమెరికాలో ఏకంగా డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. ఈ విషయం ఆశ్చర్యానికి గురిచేసినా.. నమ్మి తీరాల్సిందే! ఎందుకంటే.. ఈ విషయాన్ని తాజాగా తెరమీదకి తీసుకొచ్చింది ఎవరో కాదు.. కాంగ్రెస్ మీద నిత్యం ‘లావా’లా ఎగిసిపడే బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి. మీడియా ముందుకొచ్చిన ప్రతిసారీ కుండబద్దలుకొట్టే స్వామి.. తాజాగా రాహుల్ గాంధీ ‘డ్రగ్స్’ విషయాన్ని తెరమీదకు తీసుకొచ్చి సరికొత్త సంచలనం రేపారు.

2001లో రాహుల్ గాంధీ అమెరికాలో డ్రగ్స్ తో వుండగా ఆయన్ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు పట్టుకున్నారంటూ తాజాగా స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ సమయంలో సోనియా గాంధీ వేడుకోలు మేరకు అప్పటి ప్రధాని వాజ్ పేయి కల్పించుకుని రాహుల్ ని విడిపించారని ఆయన తెలిపారు. రాహుల్ వద్ద 1.6 వద్ద లక్షల డాలర్ల విలువైన వైట్ పౌడర్ దొరికిందని పేర్కొన్న ఆయన.. ఆనాడు అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ కు స్వయంగా వాజ్ పేయి ఫోన్ చేసి విడిపించారని ఆయన ఓ హిందీ పత్రికకు ఇచ్చి ఇంటర్వ్యూలో స్వామి వెల్లడించారు. ఈ డ్రగ్స్ విషయాన్ని తాజాగా గుర్తుచేసుకున్న ఆయన.. బీజేపీ మంత్రుల మీద ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్ నేతలు తమ తప్పులను తెలుసుకోవాలని హితవు పలికారు.

ఇక ఈ క్రమంలోనే వసుంధరా రాజే వ్యవహారంపై స్వామి మాట్లాడుతూ.. ఆమెను ‘ఝాన్సీకి రాణీ’గా అభివర్ణించారు. ఏ వివాదం నుంచైనా ఆమె సొంతంగానే సులువుగా బయటపడగలదని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆమెకు మద్దతుగా ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆమె నేరం చేయాలని భావించలేదని, కేవలం మానవత్వాన్ని మాత్రమే చాటి చూపారని స్వామి పేర్కొన్నారు. కాగా.. లలిత్ మోడీ ‘మనీ స్కామ్’లో వసుంధర రాజే కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  subramanya swamy  bjp party  

Other Articles