Rap song | Unilever | Sofia ashraf | kodaikanal | mercury

27 year old indian raps against unilever

Rap song, Unilever, Sofia ashraf, kodaikanal, mercury

27 Year Old Indian Raps Against Unilever. Kodaikanal won't step down, until you make amends now" - Chennai-born rapper Sofia Ashraf's message to a corporate is loud, clear and catching on swiftly.

ITEMVIDEOS: ర్యాప్ సాంగ్ తో యునిలివర్ కు చెమటలు పట్టిస్తోంది

Posted: 08/03/2015 04:16 PM IST
27 year old indian raps against unilever

యునిలివర్.. అదేనండీ లైఫ్ బాయ్, పెప్సోడెంట్, రిన్ లాంటి ఎన్నో బ్రాండెడ్ ఐటమ్స్ ఉత్పత్తికి ఎంతో పేరుగాంచిన కంపెనీ. అయితే ఈ కంపెనీని ఓ అమ్మాయి పాట వణికిస్తోంది. ఏంటీ పాట కంపీనిని గడగడలాడిస్తోందా..? అని అనుకోకండి.. అది మామూలు పాట కాదు ర్యాప్ సాంగ్. ర్యాప్ సాంగ్ అయితూ ఇంకా మంచిది సాంగ్ కు హమ్ కూడా చెయ్యవచ్చు అని అనుకుంటున్నారేమో.... అమ్మడు యునిలివర్ కంపెనీ మీద.. ఆ కంపెనీ చేస్తున్న నిర్వాకం మీద మాంచి రిథమిక్ గా పాటిపాడింది. ఇంకేముందు పాటను అప్ లోడ్ చేసిన కొన్ని రోజుల్లో భీభత్సమైన పాపులారిటీ రావడంతో యునిలివర్ కంపెనీ మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అసలు ఆ వీడియోలో ఏముందో మీరూ ఓ సారి చూడండి.

హిందుస్తాన్ యునిలివర్ అనే కంపెనీ కొడైకెనాల్ లో థర్మామీటర్ల తయారీ ఫ్యాక్టరీని స్థాపించింది. అయితే ఆ ఫ్యాక్టరీ లో వాడే మెర్క్యురీ వల్ల అక్కడ పని చేసిన ఉద్యోగులకు రకరకాల ఆరోగ్య సమస్యలు రావడం జరిగింది. అయితే ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చే కెమికల్ వేస్టేజ్ ను బయటకు వదలడంతో మొత్తం చుట్టుపక్కలి పరిసరాలు కూడా పొల్యూట్ అవుతున్నాయి. దాంతో చిన్న పిల్లలకు అనారోగ్యం కలగడంతో పాటు అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో సోఫియా అష్రఫ్ అనే అమ్మాయి నిక్కీ మినాజ్ చేసిన అనకొండ ర్యాప్ సాంగ్ ను లిరిక్స్ మార్చి యునిలివర్ కంపెనీ ఆగడాల మీద హమ్ చేసింది. దాంతో నెట్ లో ప్రస్తుతం ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. దీని మీద నిక్కీ మినాజ్ కూడా మెచ్చుకోవడంతో వరల్డ్ వైడ్ గా వీడియో ఎంతో పాపులర్ అయింది.

దాంతో యునిలివర్ కంపెనీకి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఎంతో మంది యునిలివర్ కంపెనీ బాధితులు దీనిపై హర్ఫం వక్తం చేస్తున్నారు. యునిలివర్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్న తమకు అష్రఫ్ మంచి ఫ్లాట్ ఫాం కల్పించిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం వ్యవహారం మీద యునిలివర్ కంపెనీ వివరణ ఇచ్చుకుంది. కంపెనీ నుండి విడుదలవుతున్న ఉద్ఘారాల్లో ఎలాంటి హానికర మెర్క్యురీ లేదని కంపెనీ వాదిస్తోంది. ఇప్పటికే చాలా సార్లు పరీక్షలు నిర్వహించామని ఎవరూ దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. మొత్తానికి ఓ ర్యాప్ సాంగ్ యునిలివర్ కంపెనీకి చెమటలు పట్టిస్తోంది. మరి ఈ వీడియో ఇంకెన్ని సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rap song  Unilever  Sofia ashraf  kodaikanal  mercury  

Other Articles