RevanReddy | Laxma Reddy | Telaangana

Revanth reddy express his doubts on t minister laxma reddy doctorate

RevanReddy, Laxma Reddy, Telaangana, BHMS, Dr. Laxma Reddy

Revanth Reddy express his doubts on T Minister Laxma Reddy Doctorate. Revanth Reddy said that laxma Reddy gave two different years of his BHMS Education in election affidavit.

ITEMVIDEOS: టి మంత్రి డా. లక్ష్మారెడ్డి డాక్టర్ కాదా..?

Posted: 08/08/2015 08:27 AM IST
Revanth reddy express his doubts on t minister laxma reddy doctorate

మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజక వర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి మధ్య మాటల యుద్దం జరిగింది. వ్యక్తిగత విమర్శలకు పోవద్దని లక్ష్మారెడ్డి ఎంతలా సర్దిచెప్పే ప్రయత్నం చేసినా కానీ రేవంత్ రెడ్డి మాత్రం మాటల తూటాలు పేల్చారు. చంద్రబాబు నాయుడు దగ్గర గులాంగిరీ చేసింది నువ్వు. చైర్మెన్ పదవి తీసుకువచ్చింది నువ్వు అంటూ లక్ష్మారెడ్డి మీద తీవ్రంగా మండిపడ్డారు. దాంతో అటు టిడిపి కార్యకర్తలు, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య వివాదం రాజుకుంది. అయితే తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి డాక్టర్ చదవు మీద రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.



‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ తరహాలో... తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి బీహెచ్‌ఎంస్‌’... ఇది టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణ. దీనిపై లక్ష్మారెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. తాను గుల్బర్గాలో డాక్టర్‌ డిగ్రీ పొందానని చెప్పారు. అయితే... 2004, 2014 ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించిన వివరాల ఆధారంగా లక్ష్మారెడ్డి డాక్టర్ విద్ మీద అనుమానాలు రేకెత్తిస్తోంది. లక్ష్మారెడ్డి తాను బ్యాచిలర్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ (బీహెచ్‌ఎంస్‌) పూర్తి చేసినట్లు ఈ రెండు అఫిడవిట్లలో పేర్కొన్నారు. అయితే... 2004 ఎన్నికల అఫిడవిట్‌లో తాను 1988లో బీహెచ్‌ఎంఎస్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో... 1987లోనే బీహెచ్‌ఎంఎస్‌ పూర్తిచేశానని తెలిపారు.

గుల్బర్గా యూనివర్సిటీ లో బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుకు 1990 నుంచి మాత్రమే అనుమతి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ఆయుష్‌’ పరిధిలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హోమియోపతి  వెబ్‌సైట్‌లోనే ఈ విషయం స్పష్టంగా ఉంది. మరి... 1988లోనే ఈ యూనివర్సిటీ నుంచి బీహెచ్‌ఎంఎస్‌ పట్టా తీసుకోవడం ఎలా సాధ్యం? లక్ష్మారెడ్డి చెప్పిందే నిజమైతే... గుల్బర్గా విశ్వవిద్యాలయం సీసీహెచ్‌ అధికారిక అనుమతి లేకుండానే ఈ కోర్సు నిర్వహించి ఉండాలి. విద్యా సంస్థలు ఇలా అనుమతి లేకుండానే ఇచ్చే పట్టాలు చెల్లవు. ‘చెల్లని అర్హత’ల గురించి ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించడం అస్సలు కుదరదు. మరి దీనిపై మంత్రి లక్ష్మారెడ్డి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఢిల్లీలో న్యాయశాఖ మంత్రికి జరిగినట్లే లక్ష్మారెడ్డికి కూడా జరుగుతుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. డాక్టర్ పట్టా మీద తలెత్తిన వివాదం చివరకు లక్ష్మారెడ్డి మంత్రి పదవికి గండంగా మారుతుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RevanReddy  Laxma Reddy  Telaangana  BHMS  Dr. Laxma Reddy  

Other Articles