Telangana | Film industry | Telugu cinema

Kcr government shocks telugu film industry

Telangana, Film industry, Telugu cinema industry, Tollywood, KCR, Land, Banjarahills

KCR government shocks Telugu film industry In a major shock to Telugu film industry, Telangana government to auction 15 acres of prime land in Banjara Hills. This land was allotted to AP State Film Development Corporation in 1991 for the development of the film industry in Hyderabad.

సినిమా వాళ్లకు కేసీఆర్ సాలిడ్ షాక్

Posted: 08/11/2015 09:19 AM IST
Kcr government shocks telugu film industry

కేసీఆర్ అంతే ఎప్పుడు ఎలా చేస్తారా ఎవరికీ తెలియదు. ఉన్నట్టుండి.. కొత్త ప్రతిపాదనలను తెర మీదకు తీసుకువస్తారు.. అనుకున్నదే ఆలస్యంగా వెంటనే జీఓలు విడుదల చేస్తారు. ఇది అందరికి తెలిసిందే... అయితే తాజాగా కేసీఆర్ సినిమా వాళ్లకు షాక్ ఇచ్చారు. షాక్ అంటే మామూలు షాక్ అనుకునేరు సాలిడ్ షాక్. సినిమా వాళ్లను ఎంకరేజ్ చేస్తాం.. హాలీవుడ్ రేంజ్ లో మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం అదీ.. ఇదీ ఆవకాయ్  అన్న కేసీఆర్ ఇప్పుడు సినిమా వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీని బలోపేతం చేయాల్సిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సినిమా ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చారు. మొన్నటి దాకా సినిమా వాళ్ల గురించి అంతలంతలు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ సినిమా పరిశ్రమలోని వాళ్లంతా అవాక్కవుతున్నారట. ఇంతకీ కేసీఆర్ సినిమా వాళ్లకు ఇచ్చిన షాక్ ఏంటీ...? అనేగా మీ అనుమానం అయితే మొత్తం స్టోరీ చదవండి.

తెలుగు సినిమా డెవలప్ మెంట్ కోసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1991లో 35 ఎకరాల భూమిని హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కేటాయించింది. సినిమా పరిశ్రమకు మరింత ఊతమివ్వాలనే ఉద్దేశంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి ఆలోచనే భూ కేటాయింపు. ఇక్కడ చాలా మందికి ఉపాధి దొరికింది. ఎన్నో మంచి మంచి సినిమాలు రావడానికి.. తెలుగు సినిమా కీర్తిని మరింత పెంచడానికి ఎంతో ఉపయోగపడిన నిర్ణయం. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ భూముల మీద కన్నేశారు. ఉన్న 35 ఎకరాల్లో 16 ఎకరాలను అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూం స్కీం కోసం నిధుల కొరత ఏర్పడిది. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి కేటాయించిన భూమిలోని 16 ఎకరాల స్థలాన్ని ఎకరాకు 40 కోట్ల చొప్పున అమ్మాలని చూస్తున్నారు. అలా వచ్చిన డబ్బులను డబుల్ బెడ్ రూం స్కీంకు మళ్లిస్తారు. కానీ నిధులు లేకపోతే సినిమా ఇండస్ట్రీ భూముల మీద కన్నేయమేంటి అని అందరు చర్చించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకోవాలని.. ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్దికి కృషి చెయ్యాలని సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Film industry  Telugu cinema industry  Tollywood  KCR  Land  Banjarahills  

Other Articles