ఏపీ స్పెషల్ స్టేటస్ పై ఎవరి డ్రామా వాళ్లే నడుపుతున్నారు. ఎవరి డప్పు వాళ్లు తెగ కొట్టుకొంటున్నారు. పార్టీలన్నీ పోటీపడి మరీ మహేశ్ దూకుడు సినిమాల్లో క్యారెక్టర్లలా యాక్షన్ ఇరగదీసేస్తున్నారు. బెస్ట్ పర్మార్మెన్స్ అవార్డ్ నాకే ఫిక్స్ అని కాంగ్రెస్ అనుకుంటుంటే.. కాదు నాకే డిసైడ్ అయిపోయిందని వైసీపీ భావిస్తోంది... వీళ్లెవరికీ కాదు... సెంట్రలో ఉంది మా ప్రభుత్వమే కనుక ప్రజ్ మనీ మోడీ మాకు ఎపుడో ఫిక్స్ చేశాడని తెలుగుదేశం భరోసాగా ఉంది. ఈ పార్టీలకు తోడు ఎర్రజెండా పార్టీలు, చిన్నా చితక సంస్థలు సైతం ప్రత్యేక హోదా ప్రైజ్ మనీ కొట్టేసేందుకు యాక్షన్ చించేస్తున్నారు.
ఏపీ ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ కర్రవిరగకుండా పాము చావకుండా అన్నట్లు వ్యవహరిస్తోంది. ఎన్నికలకు ముందు సై అని... ఆ తర్వాత నై అంటోంది. ఏపీకి స్పెషల్ స్టేటస్ ప్రకటిస్తే మిగతా రాష్ట్రాల నుంచి డిమాండ్లు వెల్లువలా వచ్చే అవకాశం ఉంది. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం బాగానే డ్రామా పండిస్తోందని చెప్పాలి. గట్టిగా పట్టుపడితే బీజేపీతో కటీఫ్ అయి మొదటికే మోసం వస్తుందనే ఆలోచనలో ఉంది. సమాధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి బతకాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మంత్రంలా కన్పిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన నాయకులు తిరిగి మళ్లీ కనీసం రోడ్లెక్కాలంటే స్పెషల్ స్టేటస్ ఒక్కటే ఇపుడు వాళ్ల మార్గం.. అందుకే రాహుల్ పర్యటన సందర్భంగా స్పెషల్ స్టేటస్ పైనే దృష్టిసారించారు.
ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఆలస్యంగా దూకుడు పెంచింది.. ఏకంగా ఢీల్లీలోనే మకాం పెట్టి జంతర్ మంతర్ లో ప్రతాపం చూపిస్తోంది. సందు దొరికితే చాలు టీడీపీని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. హస్తిన ఆందోళనలోనూ టీడీపీనే మెయిన్ గా టార్గెట్ చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్ర సర్కార్ ను తమలపాకుతో కొడితే.. నిమిత్త మాత్రులమైన తమను తలుపు చెక్కతో జగన్ కొడుతున్నాడని టీడీపీ బాహాటంగానే చెబుతోంది. పార్టీలన్నీ కలిసి కట్టుగా పోరాడితే ప్రత్యేక హోదా రావడం ఖాయం.. కానీ వీళ్లు కలవరు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more