Mumbai | Shopkeeper | Rowdy

Shopkeeper complains about extortion goons attack him with sword

Mumbai, Shopkeeper, Rowdy, Sword, Mumbai Rowdy

Shopkeeper Complains About Extortion Goons Attack Him With Sword A physically challenged shopkeeper was attacked with a sword on Tuesday night for daring to raise his voice against a group of druggies who used to extort money from nearly 200 shopkeepers on the threat of violence and arson.

షాప్ ఓనర్ మీద కత్తితో దాడిచేసిన రౌడీ

Posted: 08/13/2015 12:33 PM IST
Shopkeeper complains about extortion goons attack him with sword

బెదిరిస్తారు.. భయపెడతారు.. మాట వినకపోతే ఎంతకైనా తెగిస్తారు ఇది.. రౌడీయిజంలో ఓ భాగం. భారత ఆర్థిక రాజధానిగా ఎంతో పేరున్న ముంబై నగరంలో ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. మాఫియాకు, రౌడీయిజానికి కేరాఫ్ గా నిలిచే ముంబైలో జరిగే అకృత్యాలు, హింసాత్మక ఘటనలకు లెక్కలేదు. ఎంతో మంది రౌడీలు అమాయకుల రక్తమాంసాలను పీల్చిపిప్పి చేస్తుంటారు. ముంబై నగరంలో చోటుచేసుకున్న ఘటన తాజాగా కలకలం రేపుతోంది. అసలే అంగవైకల్యం ఉన్న వ్యక్తి, అందునా మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుండాలు చేసిన నిర్వాకం మీద స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో వెలుగులోకి వచ్చిన తాజా ఘటనకు ముందు కూడా ఎన్నో ఘటనలు జరిగాయి. అమాయకులను మామూళ్ల కోసం పీడించే గుండాలు ముంబైలో తక్కువేం కాదు.



ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఉన్న పి.ఎల్ లోకాందె మార్గ్ లో దాదాపు 200 దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ రౌడీరాజ్యం నడుస్తోంది. రౌడీలు చేసిందే శాసనం.. రౌడీలు చెప్పిందే వేదం. దుకాణాలు తెరవాలన్నా.. అక్కడ ఉండాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే. నెలనెలకు ఖచ్చితంగా మామూళ్లు ఇవ్వాల్సిందే. లేదు కాదు కుదరదు అని అంటే మాత్రం వారు అక్కడ ఉండలేరు. అక్కడ వ్యాపారం చెయ్యలేరు. అతిగా ప్రవర్తిస్తే మాత్రం ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. పి.ఎల్ లోకాందె మార్గ్ లో ఉంటున్న రాజ్ నాష్ సింగ్ ధాకూర్ మీద స్థానిక గుండా మామూళ్ల కోసం వత్తిడి చేశారు. అయితే ఎంతకీ అతను మామూళ్లు ఇవ్వకపోవడంతో ఏకంగా కత్తితో దాడి చేశారు. అయితే అదే సమయానికి అక్కడ ఓ కస్టమర్ ఉండటంతో ఆ రౌడీని అడ్డుకున్నారు. మొత్తం వ్యవహారం సిసిటివి పుటేజీలో రికార్డైంది. పోలీసులు దీని మీద కంప్లైంట్ ఫైల్ చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai  Shopkeeper  Rowdy  Sword  Mumbai Rowdy  

Other Articles