Indonesian airliner that crashed with 54 aboard spotted

Indonosia plane found crashed debris found

wreckage of the Indonesian passenger plane, debris of Indonesian plane, indonosia plane found crashed, debris found, indonesia, plane crash, papau, Indonesian plane goes missing in Papua Indonesia Trigana Air

A search plane has spotted the wreckage of the Indonesian passenger plane that went missing with 54 people on board in Indonesia's mountainous easternmost province of Papua, rescue officials said on Monday

కుప్పకూలిన ఇండోనేషియా విమానం. శిధిలాలు లభ్యం..

Posted: 08/17/2015 08:27 AM IST
Indonosia plane found crashed debris found

ఇండోనేసియాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇవాళ మధ్యాహ్నం గల్లంతయిన ఇండోనేషియా విమానం కుప్పకూలిపోయింది. ఆదివారం మధ్యహ్నం పపువా ప్రాంతంలో పర్వతంపై కూలిపోయినట్టు స్థానికులు చెప్పారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ విమానంలో  54 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అధివారం మధ్యాహ్నం పపువా రాజధాని జయపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి  ట్రిగన ఎయిర్ ఏటీఆర్ 42 విమానం ఓక్సిబిల్కు బయల్దేరింది.

పపువా రాజధాని జయపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి ఓక్సిబిల్కు బయల్దేరిన ట్రిగన ఎయిర్ ఏటీఆర్ 42 విమానం ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విమానం ఎయిర్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు చెప్పారు. ఆ సమయంలో దట్టమైన మేఘాలు, వర్షం, పొగమంచుతో వాతావరణం చాలా ప్రతికూలంగా ఉందని తెలిపారు. ప్రతికూల వాతావరణం వల్లే విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

విమానం కొండను ఢీకొని కుప్పకూలిపోవడంతో అందులోని వారెవరూ బ్రతికుండే అవకాశం లేదని అక్కడి అధికారులు భావిస్తున్నారు. విమానం గల్లంతైన కొద్ది గంటల తరువాత పపువా గినియా ప్రాంతంలోని పెద్ద శబ్దంతో పెలుడు సంభవించింది. ఇది గమనించి స్థానికులు విమాన శకలాలను గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందవేశారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కాగా, గత సంవత్సరం డిసెంబర్ 28 జావా సముద్రంలో ఎయిర్ ఏషియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. తాజా మరో విమానం కూలిపోవడంతో ఇండోనేషియా విమానాలంటేనే ప్రయాణికుల్లో దడ పుడుతోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles