Amaravati | AP | Land Bill | land acquisition

Ap govt likely to land acquisition bill for lands for the amaravathi

Amaravati, AP, Land Bill, land acquisition bill, Chandrababu Naidu, Capital city land

AP Govt likely to land acquisition bill for lands for the Amaravathi. State of ap, need more lands for the capital city Amaravati. AP Govt need two thousand acers for capital city amaravati.

ఏ విధంగా ముందుకు వెళతారో చంద్రబాబు

Posted: 08/20/2015 11:04 AM IST
Ap govt likely to land acquisition bill for lands for the amaravathi

ఏపి కలల రాజధాని అమరావతి శంఖు స్థాపన తేదీ దసరా నాడు అనుకున్నారు. అయితే ఏపి ప్రభుత్వం ఇప్పటికే కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వేల ఎకరాల పొలాలను ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి తీసుకుంది. ఎంతో మంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చారు. వేల ఎకరాల భూముల్లో అంగరంగ వైభవంగా, అన్ని మౌళిక సదుపాయాలతో రాజధాని రూపుదిద్దుకోనుంది. అయితే ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సంపాదించిన ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం మరో రెండు వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండాలి. రెండు వేల ఎకరాల భూమిని రైతుల నుండి తీసుకోవాల్సి ఉంది. కానీ ల్యాండ్ పూలింగ్ గడువు నేటితో ముగుస్తుండటంతో సర్వత్రా ఉత్కంతట నెలకొంది. ప్రభుత్వం మరో రెండు వేల ఎకరాల భూమిని సంపాదించాలంటే ల్యాండ్ యాక్విజీషన్ యాక్ట్ ద్వారా రైతుల నుండి తీసుకోవలసి ఉంటుంది.

క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రభుత్వం నుండి వెలువడే ల్యాండ్ యాక్విజిషియన్ చట్టం కోసం ఎదురుచూస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇవ్వడానికి ముందుకు రాని రైతులు ఈ కొత్త చట్టం కింద ఖచ్చితంగా తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వడానికి ముందు వచ్చిన వారికి ప్రభుత్వం ద్వారా లభించే ప్రయోజనాలు కొత్తగా ల్యాండ్ యాక్విజీషన్ చట్టం కింద తీసుకునే భూముల రైతులకు వర్తించవు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని.. ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కాగా ల్యాండ్ యాక్విజీషన్ మీద ప్రభుత్వం కాస్త డైలమాలో ఉంది. రైతుల నుండి వ్యతిరేకత వస్తుండటంతో పాటుగా పవన్ కళ్యాణ్ లాంటి వారు భూములను బలవంతంగా లాక్కొవద్దని వార్నింగ్ లు ఇస్తుండటంతో ప్రభుత్వం కాస్త ఆలొచనలో పడింది. మరి చంద్రబాబు సర్కార్ ఏది ఏమైనా సరే ల్యాండ్ యాక్విజిషన్ చట్టం కిందైనా ల్యాండ్ ను తీసుకుంటుందో లేదంటే వేరే ఆలోచన ఏదైనాచేస్తుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravati  AP  Land Bill  land acquisition bill  Chandrababu Naidu  Capital city land  

Other Articles