Pakistan Military ISI Shifted Dawood Ibrahim From Karachi To Murray | Indian Intelligence Reports

Pakistan military isi shifted dawood ibrahim from karachi to other place

Dawood Ibrahim, Dawood Ibrahim Crime news, pakistan military, isi terrorists, Dawood Ibrahim pakistan, dawood in pakistan, Pakistan Terror, Dawood Ibrahim family members, 1993 Mumbai Blasts

Pakistan Military ISI Shifted Dawood Ibrahim From Karachi To Other Place : When Indian Intelligence Report Reveals The Address Of Dawood Ibrahim.. Pakistan Military ISI Shifted Dawood Ibrahim From Karachi To Other Place Called Murray.

భారత్ దెబ్బకు జడిసి.. దావూద్ ని షిఫ్ట్ చేశారు?

Posted: 08/24/2015 02:43 PM IST
Pakistan military isi shifted dawood ibrahim from karachi to other place

1993 ముంబై దాడుల్లో ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే తలదాచుకున్నట్లు ఇటీవలే భారత నిఘా వర్గాలు కనుగొన్న విషయం తెలిసిందే! అతగాడు తన కుటుంబసభ్యులతో కలిసి కరాచీలోనే వుంటున్నాడని, అతనికి సంబంధించి తాజా ఫోటోలను కూడా నిఘా విడుదల చేసింది. దావూద్ భార్య పేరుమీదున్న టెలిఫోన్ బిల్లుల ఆధారంగా దావూద్ కు మూడు చిరునామాలు వున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అతనిని పట్టుకుని, భారత్ కు రప్పించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేయగా.. పాక్ ప్రభుత్వం అతనిని రక్షించేందుకు కరాచీ నుంచి షిఫ్ట్ చేసినట్లు సమాచారం.

తాజాగా వెలువడుతున్న వార్తల ప్రకారం.. దావూద్‌‌‌ను కరాచీలోని అతని ఇంటినుంచి ఉత్తర పాకిస్తాన్‌‌‌లోని ‘ముర్రే’లో గల సురక్షిత ప్రాంతానికి ఐఎస్ఐ, పాక్ సైన్యం తరలించినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దావూద్‌‌‌కు సంబంధించి అతని మూడు పాస్‌‌పోర్టుల వైనం, అతనిభార్య లైమ్‌‌లైట్‌లోకి రావడం, అతని తొమ్మిది నివాసస్థలాల గురించి భారత ప్రభుత్వం  గుట్టువిప్పడంతో పాకిస్తాన్ ప్రభుత్వం బెంబేలెత్తింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తమ వాహనంలో పాక్ సైన్యం దావూద్‌‌ను మరో సురక్షిత ప్రాంతానికి తరలించిందని తెలిసింది. అతనిని ఇలా షిఫ్ట్ చేయడంలో పాక్ సైన్యానికి ఐఎస్ఐ కూడా సహకరించింది.

నిజానికి.. దావూద్ తమ దేశంలోనే లేడని పాకిస్తాన్ బుకాయిస్తూ వచ్చింది. కానీ ఈ గ్యాంగ్ స్టర్ కరాచీలోని క్లిఫ్టన్  ప్రాంతంలో జియాదుద్దీన్ హాస్పిటల్ సమీపంలోని షిరీన్ జిన్నా కాలనీలో నివసిస్తున్నాడని, ఈ లొకేషన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కొడుకు బిలావల్ భుట్టో జర్దారీ ఇంటి దగ్గరలోనే ఉందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో కలవరి పడిన పాక్.. అతడ్ని సేఫేస్ట్ లొకేషన్‌‌‌కు తరలిందని తెలుస్తోంది. బహుశా అతడ్ని ముర్రే నుంచి కూడా మరో ప్రాంతానికి తరలించవచ్చునని భావిస్తున్నారు. భారత్ దృష్టి మరలించేందుకు రకరకాల ప్రాంతాలకు దావూద్ ని షిఫ్ట్ చేస్తూనే వుంటారని భావిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dawood Ibrahim  1993 mumbai blasts  pakistan military  

Other Articles