Javed Ahmed replaces Rakesh Maria as Mumbai top cop in middle of Sheena Bora murder probe

Rakesh maria shifted ahmed javed is the new mumbai top cop

Rakesh Maria, Ahmed Javed, Rakesh Maria shifted, Rakesh Maria Transfered, Mumbai Police Commissioner, DGP, uddav thakary, Chief minister devendra fadnavis, japan tour, DGP home guards

The Maharashtra government on Tuesday replaced Mumbai Police chief Rakesh Maria, who was personally handling the Sheena Bora murder probe, with Ahmed Javed, a director general of police level officer

షీనాబోరా కేసు దర్యాప్తు అధికారి బదిలీ.. వేటేనా..? లేక పదోన్నతా..?

Posted: 09/08/2015 06:01 PM IST
Rakesh maria shifted ahmed javed is the new mumbai top cop

ఏక్కడైనా, ఏదైనా రాజకీయ కోణమో, సంచలనమో జరిగితే వాటిపై మీడియా అడిగే ప్రశ్నలకు పాలక పక్ష నేతల నుంచి, పలు సందర్భాలలో ప్రతిపక్ష నేతల నుంచి కూడా వినబడే సమాధానం చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని. అయితే తన పనిని తాను చేస్తున్న ఓ పోలీసు కమీషనర్ పట్ల మాత్రం అక్కడి ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కాగా దాన్ని సమర్థించుకునేందుకు ఆయన పనితనం చేసి పదోన్నతి కల్పించడం కూడా తప్పంటే ఎలా అంటూ స్వయంగా ప్రభుత్వమే మీడియాను ప్రశ్నింస్తుంది. ఇలా జరిగింది ఎక్కడా..? అంటరా..?

దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న షీనా బోరా హత్య కేసు విచారణ సాగుతున్న ముంబైలో దర్యాప్తు అధికారి ముంబై నగర పోలీసు కమీషనర్ రాకేష్ మారిమా విషయంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాఫ్తు చేస్తున్నరాకేష్ మారియాను బదిలీ చేశారు. ఆయనకు హోంగార్డ్స్ డీజీగా ప్రమోషన్ ఇచ్చింది రాకేష్ మారియా స్థానంలో అహ్మద్ జావెద్ ను నియమించిన మహారాష్ట్ర ప్రభుత్వం. ఆయనకు ముంబై పోలీస్ కమిషనర్ బాధ్యతలను అప్పగించింది.

షీనా బోర్డర్ కేసు దర్యాఫ్తు చేపట్టడంతో రాకేశ్ మారియా పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు, హుతురాలి తల్లి అయిన  పారిశ్రామికవేత్త ఇంద్రాణి ముఖర్జీయా భర్త పీటర్ ముఖర్జీయాకు రాకేష్ సన్నిహితుడు. అయినప్పటికి రాకేష్ పక్షపాతం లేకుండా ఎంతో నిక్కచ్చిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. భారీ ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని.. ఈ కేసు విషయంలో రోజురోజుకు కొత్త విషయాలను కూపీలాగి భయటకు తీసుకుస్తున్న తరుణంలో మారియా బదిలీపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వంలో భాగస్వామిగా వుంటూనే అడపాదడపా ప్రభుత్వంపై చిర్రుబుర్రులాడే శిశసేన అధినేత ఉద్దవ్ థాకరే.. తొలుత ఈ కేసు విషయమై మీడియా ఎదుట తన అసహనాన్ని ప్రదర్శించారు. మీడియాకు ఇదే పనా.. వేరే పనేం లేదా.. అంటూ ఆయన ప్రశ్నించారు. ఆ తరువాత షీనాబోరా హత్య కేసు దర్యాప్తు సాగుతున్న తీరుపై ఏకంగా ముఖ్యమంత్రి దేవేంద్ర పెడ్నావిస్ కూడా తన అసంతృప్తిని వెళ్లగక్కిన తరుణంతో.. రాకేష్ మారియాపై ఉన్నతాధికారులు బదిలీ వేయడం.. చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యప్తు కీలక దశకు చేరుకున్న ఈ తరుణంలో పదోన్నతిపై బదిలీ చేయడం వేటు వేయడమేనంటు విమర్శలు వినవస్తున్నాయి.

అయితే అవన్నీ ఊహాగానాలేనని, సాధారణ ప్రమోషన్లలో భాగంగానే మారియా డీజీగా నియమితులయ్యారని ముంబై రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కెపి బక్షీ పేర్కొంన్నారు. రాకేష్ మారియా బదిలీకి షీనాబోరా హత్యకేసుకు ఎలాంటి సంబంధం లేదని పేర్కోన్నారు. మరో వారం పది రోజుల్లో రానున్న గణేశ్ ఉత్సవాల నుంచి దీపావళి వరకు కోనసాగనున్న పండుల సీజన్ కు ముందు కొత్తవారు కూడా శాంతిభద్రతలపై అవగాహనకు రావాలి కదా అని అన్నారు. దీనినే ఎత్తిచూపుతున్న సాధారణ ప్రజలు మారియాను సరిగ్గా ఇప్పుడు బదిలీ చేయడం కరెక్టు కాదంటున్నారు. దీపావళి తరువాత బదిలీ చేసివుండాల్సిందని అభిప్రాయపడుతున్నారు

ఇక 2012లో షీనా బోరా హత్య జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు విచారణ... దాదాపు ఓ కొలిక్కి వస్తోంది. దీనికి సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సంపాదించారు. హత్య కేసులో పోలీసులు గుర్తించిన మృతదేహానికి సంబంధించిన అస్థికలు షీనా బోరావేనని డీఎన్ఏ పరీక్షలో వెల్లడైంది. డీఎన్ఏ నివేదిక ప్రకారం ముంబయి సమీపంలోని రాయ్ గఢ్ అటవీ ప్రాంతంలో లభ్యమైన మృతదేహం అవశేషాల నుంచి సేకరించిన డీఎన్ ఏ ఇంద్రాణి ముఖర్జియా డీఎన్ఏతో సరిపోయింది. ఈ కేసులో కీలక నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియాను ఆగస్టు 25న పోలీసులు అరెస్టు చేశారు.

ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ లను...పోలీస్ కస్టడీలో ఉంచి విచారణ చేపట్టారు. మొదట్లో సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చిన ఇంద్రాణి టీమ్ మొత్తం పోలీసు విచారణలో దారికొచ్చింది. కీలక మలుపులు తిరుగుతూ వచ్చిన కేసులో పోలీసులు, విచారణలో వెల్లడవుతున్న విషయాలను సరిచూసుకుంటూ...హత్యకేసును ఛేదించేందుకు ప్రయత్నించారు. సరిగ్గా ఈ తరుణంలో దర్యాప్తు అధికారి బదిలీ కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నావిస్ జపాన్ పర్యటనకు ఇవాళ బయలుదేరి వెళ్లారు. నిన్న సాయంత్రమే ఆఘమేఘాల మీద ఆయన బదిలీ ఫైలుపై సంతకాలు చేయడంతో రాజకీయ నేతలు నుంచి ఒత్తిడి కారణంగానే కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు ప్రయత్నాలు తెర వెనుక ప్రయత్నాలు జరిగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles