Rakesh Maria 'not thinking of resigning' after sudden transfer

Not thinking of resigning says rakesh maria after abrupt transfer

Rakesh Maria, Ahmed Javed, Rakesh Maria shifted, Rakesh Maria Transfered, Mumbai Police Commissioner, DGP, uddav thakary, Chief minister devendra fadnavis, japan tour, DGP home guards

A day after he was shunted out of the post of Mumbai Police Commissioner, senior IPS officer Rakesh Maria on Wednesday said he was not contemplating quitting.

బదిలీ వెనుక రాజకీయ ప్రమేయం.. ఆ వార్తలు నిజం కాదు

Posted: 09/09/2015 02:02 PM IST
Not thinking of resigning says rakesh maria after abrupt transfer

ముంబై పోలీసు కమీషనర్ గా తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ.. గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనాబోరా కేసును నిఫ్పాక్షపాతంగా దర్యాప్తు చే్స్తున్న క్రమంలో అకస్మికంగా తనను బదిలీ చేయడంపట్ల తనకు చెప్పలేనంత బాధగా వుందని సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ మారియా అవేదన వ్యక్తం చేశారు. సిన్సియర్ పోలీసుల అధికారిగా తాను ఎక్కడ వున్నా తన విధులను ఖచ్చితంగా నిర్వర్తిస్తానని చెప్పారు. తన ఆకస్మిక బదిలీ వేటుతో మనస్తాపానికి గురై తాను రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు.అయితే రాజీనామా చేసే ఆలోచనేది లేదని తనకు లేదని ఆయన తే్ల్చిచెప్పారు.

షీనా హత్య కేసును విచారిస్తున్న ఆయనను మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నపళంగా బదిలీ చేసి, డీజీపీ(హోంగార్డ్స్)గా పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలోకి డీజీపీ ర్యాంక్ అధికారి అహ్మద్ జావెద్ ముంబై నూతన పోలీసు కమిషనర్‌గా నియమించారు. షీనాబోరా హత్యకేసును తాను కమీషనర్ స్థాయిలో స్వయంగా దర్యాప్తు చేయడంతో.. ఆయనపై ఒత్తడి తీసుకువచ్చినా.. ఎలాంటి లాభం లేకపోవడంతోనే ఆయనను బదిలీ చేశారని వార్తలు గుప్పుమన్నాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఈ కేసులో ఆయన విచారించి రిమాండ్ కు తరలించడంతో పాటు ఎప్పటికప్పుడు కేసు ప్రగతిని మీడియాకు వివరించడం కూడా ఆయన బదిలీకి కారణమై వుంటాయని వార్తలు వచ్చాయి.

ఈ సందర్భంగా తన అకస్మిక బదిలీ వెనుక రాజకీయ ప్రమేయం బలంగా వుందని రాకేశ్ మారియా నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్కు కూడా ఆయన నచ్చలేదని అందుకే ఆయనను వేరే శాఖకు బదిలీచేశారని కూడా విమర్శలు వినిపించాయి. ఆ నిర్ణయం హత్యకేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకేననే విమర్శలు వెల్లువెత్తడంతో దిద్దుబాటుకు దిగి బదిలీతో సంబంధం లేకుండా ఈ కేసు దర్యాప్తును మారియానే పర్యవేక్షిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, హోంగార్డ్స డిజిపిగా ఆయన ఈ కేసును మళ్లీ టేకప్ చేస్తారా..? లేదా..? అన్నది వేచి చూడాల్సిందే.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakesh Maria  Ahmed Javed  Rakesh Maria shifted  Mumbai Police Commissioner  DGP  

Other Articles