Pakistan writes to UN about Indias plan to build wall along LoC

Pakistan complaints about india

India, pakistan, Complaint, pakistan complaint on India, India on Pakistan, India Boarder, Pakistan Army, pakistan Attack on India

Pakistan has complained to the UN security council about India's plans to construct a wall along the line of control allegedly to convert it "into a quasi international border", drawing a strong reaction from India which said it will respond to this at the "appropriate time".

భారత్ మీద ఐరాసలో పాక్ ఫిర్యాదు

Posted: 09/25/2015 04:49 PM IST
Pakistan complaints about india

మన దేశానికి పక్కలో బల్లెం.. భారత్ కు దయాది దేశమైన పాకిస్థాన: మన గురించి ఫిర్యాదు చేసింది. అది కూడా ఎక్కడో కాదు ఐరాస భద్రతా మండలికి పాకిస్థాన్ ఫిర్యాదు చేసింది. సరిహద్దులో కశ్మీర్, పాక్ గుండా ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ గోడ నిర్మించాలనుకుంటోందని యూఎన్‌ఎస్‌సీకి పాక్ ఫిర్యాదు చేసింది. సరిహద్దు వెంబడి 197 కిలోమీటర్ల మేర 10 మీటర్ల ఎత్తున భారత్ గోడను నిర్మించాలనుకుంటోందని పాక్ పేర్కొంది.

గోడ నిర్మాణంపై యూఎన్‌ఎస్‌సీకి పాక్ తరపున ఐరాస రాయబారిగా వ్యవహరిస్తున్న మలీహోలోధీ సెప్టెంబర్ 4, 9వ తేదీలలో లేఖలు రాసినట్లు తెలిసింది. గోడ నిర్మాణాన్ని తీవ్రంగా పరిగణించాలని పాక్ పేర్కొంది. పాక్ ఫిర్యాదుపై భారత్ సీరియస్‌గా ఉంది. సరైన సమయంలో తగిన విధంగా స్పందిస్తామని భారత్ చెప్పింది. అయితే మోదీ పర్యటనలో భాగంగా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు గూడగడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మీద పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేయడం వెనక చాలా కుట్ర ఉంది. ఇప్పటికే అన్ని దేశాలు భారత్ కు అగ్రతాంబూలమిస్తున్నాయి. ఇక ఐరాసలో కూడా భారత్ ను అడ్డుకోవడం కుదరదని భావిస్తున్న పాకిస్థాన్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని కొంత మంది విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles