Incois Reports Says Supermoon May Effect On Vizag Like Hudhoodh Toofan | Visakhapatnam City | Andhra Pradesh State

Supermoon effects on vizag city hudhood toofan

vizag city, visakhapatnam, supermoon updates, supermoon effects vizag, hudhood toofan, supermoon controversy, andhra pradesh state

Supermoon Effects On Vizag City Hudhood Toofan : Incois Reports Says Supermoon May Effect On Vizag Like Hudhoodh Toofan.

‘విశాఖ’కు పొంచి వున్న మరో ముప్పు?

Posted: 09/28/2015 10:53 AM IST
Supermoon effects on vizag city hudhood toofan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుందర నగరంగానే పేరుగాంచిన ‘విశాకపట్నం’కు మరో ముప్పు పొంచి వున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ‘హుధుద్’ తుఫాను ఈ నగరాన్ని నేలమట్టం చేసిన విషయం తెలిసిందే! ఆ తుఫాన్ దెబ్బతో లక్ష కోట్లలో భారీ ఆస్తినష్టం కాగా.. ప్రాణనష్టం కూడా జరిగింది. అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి వున్న ఏపీ రాష్ట్రానికి ‘హుధుద్’ తుఫాన్ ఇంకా ఎన్నో కష్టాలను తెచ్చిపెట్టింది. అయినప్పటికీ.. ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధి, ప్రజల తోడ్పాటుతో ఆ నగరం త్వరగానే కోలుకుంది. కుప్పకూలిన భవనాల స్థానంలో కొత్త భవనాలు వెలుస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ‘హుదూద్’ ఆనవాళ్లు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. అయితే నవ్యాంధ్ర బిజినెస్ కేపిటల్ గా ఎదుగుతున్న ఆ నగరానికి మరో ముప్పు పొంచి ఉందని చెబుతోంది సర్కారీ వాతావరణ సంస్థ ‘ఇన్ కాయిస్’. మరోసారి ప్రకృతి ప్రకోపానికి విశాక నగరం బలికాక తప్పదని ఆ సంస్థ వెల్లడిస్తోంది. ఇందుకు కారణం ‘సూపర్ మూన్’ ప్రభావమని చెబుతున్నారు.

ఇంతకీ సూపర్ మూన్ ఏంటి? అని ఆలోచిస్తున్నారా..! భూమికి అతి చేరువగా చంద్రుడు రావడాన్ని ‘సూపర్ మూన్’గా అభివర్ణిస్తారు. గతంలో ఎన్నోసార్లు భూమికి చేరువగా చంద్రుడు వచ్చాడు. అలా వచ్చిన ప్రతీసారి ప్రకృతిలో మార్పులు ఏర్పడి, ఎక్కడో ఓ చోట విషాధ ఘటన చోటు చేసుకోవడం జరిగిందని శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు మరోసారి భూమికి చేరువగా చంద్రుడు వస్తున్నాడు. సూపర్ మూన్ గా పిలుస్తున్న ఈ ఉపద్రవం.. బంగాళాఖాతంలోనే కాక భూమండంలోని సముద్రాలపై పెను ప్రభావాన్నే సృష్టించనుందట. సూపర్ మూన్ ప్రభావం కారణంగా సముద్రంలో అలలు ఐదు అడుగుల మేర ఎగసిపడతాయని ‘ఇన్ కాయిస్’ సంస్థ చెబుతోంది. దీంతో సముద్రంలో అల్లకల్లోలం తప్పనిసరి అని హెచ్చరిస్తోంది. ఈ అలల కారణంగా తీర ప్రాంతాలకు ముప్పు ఉందని చెప్పిన ఆ సంస్థ... విశాఖతోపాటు అండమాన్, కేరళలకూ ప్రమాదం పొంచి ఉందని చెబుతోంది. వచ్చే నెల 2 వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vizag city problems  supermoon  hudhood toofan  incois  

Other Articles