Samsung family tops Forbes richest Asian families

Indian families in asia s 50 richest list ambanis rank 3rd

forbes, asian richest, lee, samsung, korea, india, ambani, 50 Richest Asina families, professional managers, Philippines,Sy, Zobel, Aboitiz families, Lim family of the Genting Group, wipro azim Premji,

The Burman family from India, who rank 30th and feature on the cover of the magazine, has brought in professional managers to ensure the continuity of the business.

అసియా 50 అపర కుబేర కుటుంబాల జాబితాలో.. 14 మనవే..!

Posted: 10/10/2015 07:26 PM IST
Indian families in asia s 50 richest list ambanis rank 3rd

ప్ర్రపంచ వ్యాప్తంగా అపర కుబేరులు ఎవరన్న విషయాన్ని మనం వెతక్కకుండానే ఏ ఏడాదికాడేడు మనకు వివరాలను జాబితా రూపంలో అందజేసే ఫోర్బ్స్ మ్యాగజైన్..  తొలిసారిగా ఆసియాలోని 50 కుబేర కుటుంబాల జాబితాను విడుదల చేసింది. ఆసియా ఖండంలో మహా ధనవంతులైన వారి వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో 14 భారతీయ కుటుంబాలకు స్థానం లభించింది. నికర ఆస్తుల విలువ 2150 కోట్ల డాలర్లతో ముఖేష్ అంబానీ కుటుంబం ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. 1700 కోట్ల డాలర్లతో అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం 7 స్థానంలో నిలిచింది.

ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. మొదటి స్థానంలో శాంసంగ్ గ్రూప్‌కు చెందిన లీ కుటుంబం తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో హాంకాంగ్‌కు చెందిన లీ షౌకీ కుటుంబం నిలిచింది. ఇక భారతీయుల్లో తొమ్మిదవ స్థానంలో హిందుజా కుటుంబం, పదో స్థానంలో మిస్త్రీ కుటుంబం, గోద్రెజ్ కుటుంబం 15 స్థానంలో, మిట్టల్ కుటుంబం 19వ స్థానంలో, 29వ స్థానంలో బజాజ్ కుటుంబం, 30వ స్థానంలో డాబర్ బర్మన్స్ కుటుంబాలు నిలిచాయి. టాప్ 50కి చేరువలో మరో ఆరు భారతీయ కుటుంబాలు ఉన్నాయి. ఫోర్బ్స్ ఈ జాబితాను సెప్టెంబర్ 25 నాటికి షేర్ల ధరలు, ఎక్స్‌ఛేంజ్ రేట్ల ఆధారంగా ఆస్తుల విలువను లెక్కించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : forbes  asian richest  lee  samsung  korea  india  ambani  

Other Articles