రోజా.. వైకాపా ఎమ్మెల్యే! ఈమె మైకు పట్టుకుంటే చాలు.. విపక్ష (ముఖ్యంగా అధికార టీడీపీ పార్టీ) పార్టీ నేతల చెవులు చిల్లుపడాల్సిందే! ఎందుకంటే.. ప్రతిఒక్క సందర్భంలోనూ ఒకే రీతిలో విమర్శలు చేయకుండా కొత్తకొత్త పదాలను జోడిస్తూ తనదైన రీతిలో కామెంట్లు చేస్తూ ముందుకొస్తారు. నిజానికి.. టీడీపీ పుణ్యమా అని రాజకీయాల్లో అడుగుపెట్టిన ఈ మాజీ నటి.. రాజకీయం అంటే ఏంటో నేర్పించిన ఆ పార్టీ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ అక్కసు వెళ్లగక్కుతుంటారు. నిత్యం ఆ పార్టీ మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న ఈమె.. తాజాగా ఆ పార్టీ మీద, ఏపీ సీఎం చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైకాపా అధినేత జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసిన నేపథ్యంలోబాబుపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు చిన్నమెదడు చితికిందని, పెద్దమెదడు పగిలిందని.. అందుకే అత్యంత అప్రస్వామిక రీతిలో జగన్ దీక్షను భగ్నం చేశారని ఆమె దుయ్యబట్టారు. ఇంకా ఆమె ఏమి చెప్పిందంటే.. ‘‘చంద్రబాబుకు చిన్నమెదడు చితికిపోయింది. ప్రజల కనీసావసరాలు పట్టించుకోకుండా మేకిన్ చైనా, జపాన్ అంటూ రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారు. ప్రత్యేక విమానాల్లో తన భజనపరులతో ఎలా తిరుగుతున్నారో చూస్తున్నాం. చంద్రబాబు రాష్ట్రాన్ని దోచి సింగపూర్కో మలేసియాకో అమ్మేద్దామని చూస్తున్నారే తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఆయనకు ఏమాత్రం ఉన్నట్లు కనపడట్లేదు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేపట్టిన దీక్షపై మంత్రులు, సీఎం.. అందరూ ఎలా ఎగతాళిగా మాట్లాడారో అంతా చూశాం. నిన్నటివరకు అసలు దాన్ని పట్టించుకోనట్లున్నారు. తర్వాత దొంగదారిన దీక్షను భగ్నం చేయాలని చూశారే తప్ప.. ఒక మంచి విషయం కోసం దీక్ష చేస్తుంటే కనీసం మంత్రులను పంపి చర్చలు జరిపించి, ప్రత్యేక హోదా తెప్పిస్తామనే హామీ కూడా ఇవ్వకుండా భగ్నం చేయడం సరికాదు. ఇక్కడితో ఈ పోరాటాన్ని వదిలేస్తారనుకుంటే వాళ్ల భ్రమ. టీడీపీ సర్కారుపై వైఎస్ఆర్సీపీ పోరాడుతూనే ఉంటుంది. మా మాట కూడా కాదంటూ జగన్ దీక్ష కొనసాగించాల్సిందే అన్నారు’’.
‘‘జగన్ తన పరిశ్రమలు పెట్టుకోడానికి అవకాశం ఇవ్వాలని ఏమీ అడగలేదు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలన్న ఏకైక ధ్యేయంతో దీక్ష చేస్తుంటే, దానిపై ప్రజల్లో అపోహలు సృష్టించేలా ఎలా చేశారో చూశాం. ప్రజలు ఆయన ఆరోగ్య పరిస్థితి చూసి ఆత్మహత్యాయత్నాలు చేయడం చూశాం. మసీదులు, గుళ్లు, చర్చిల్లో ప్రజలు చేసిన ప్రార్థనలు చూసి.. భయపడి, వెన్ను వణికి దొంగదారిన తీసుకెళ్లారు. అదే ఆయన మంత్రులు గానీ, చంద్రబాబు గానీ కనీసం ఓ ప్రెస్ మీట్ పెట్టి తాము కూడా ప్రయత్నిస్తున్నామని, దీక్ష విరమించాలని కోరుకుంటున్నామని ఒక మాట చెప్పి ఉంటే మేం కూడా హర్షించేవాళ్లం. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎన్నిసార్లు పిల్లలు చనిపోవడం, ఓ మహిళ వేళ్లను ఎలుకలు కొరికేయడం, పాములు తిరగడం చూశాం. రాజధానికి దగ్గర్లోని గుంటూరులోనే అలా ఉందంటే.. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉంటుందో చూడాలి. పేదలకు ఎలా వైద్యం ఇవ్వాలో, ఎలా భోజనం పెట్టాలో, మహిళలకు ఎలా భద్రత కల్పించాలో తెలీదు. సింగపూర్ వాళ్లకు రాజధాని అప్పగించి కమీషన్లు ఎలా నొక్కేద్దామా అనే చూస్తున్నారు. కనీసం వైద్యానికి అవసరమైన మందులు, పరికరాలు ఇవ్వలేని దౌర్భాగ్యంలో చంద్రబాబు ఉన్నారు. ప్రభుత్వం అహంకారపూరితంగా ఉంది. ఐదేళ్లు తామే ఉంటాం, ఏమీ చేయక్కర్లేదన్నట్లు చేస్తున్నారు’’ అని రోజా అన్నారు. మరి.. ఈమె వ్యాఖ్యలకు టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more