Pawan Kalyan will get invitation for Amaravati inauguration

Pawan kalyan will get invitation for amaravati inauguration

Pawan kalyan, Janasena, Pawan Kalyan on Amaravati, Amaravati, Amaravati News, Pawan Kalyan to Amaravati, Pawan Kalyan Amaravati invitation, Amaravati invitation to Pawan Kalyan, Pawan Kalyan News, pawan Kalyan on Ap, Chandrababu Naidu, Chandrababu naidu with pawan Kalyan

Janasena party president Pawan Kalyan got phone call from chandrababu Naidu yester day. Today ap ministers will invite Pawan Kalyan on Amaravati inauguration.

పవన్ కళ్యాణ్ కు అమరావతి ఆహ్వానం

Posted: 10/17/2015 11:18 AM IST
Pawan kalyan will get invitation for amaravati inauguration

జనసేన పార్టీ అధినేత, తెలుగు సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ ను అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ప్రత్యేకంగా  ఆహ్వానం అందింది. నిన్న పలువురు ప్రముఖులకు ఆహ్వానం పంపిన చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి.. అమరావతి శంఖుస్థాపనకు రావాలని ఆహ్వానించినట్లు తెలిసింది. అలాగే తన కేబినెట్ లోని మంత్రుల ద్వారా ఆహ్వాన పత్రికను పంపుతున్నట్లు కూడా వెల్లడించినట్లు సమాచారం. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు పవన్ కళ్యాణ్ కు ఆహ్వాన పత్రికను అందించారు. అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. గతంలో  ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ మోదీ చంద్రబాబుతో కలిసి వేదికను పంచుకున్నారు. తాజాగా మరోసారి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం ముగ్గురిని ఏకం చెయ్యనుంది.

ఏపి రాజధాని అమరావతి అంశంలో పవన్ కళ్యాణ్ గతంలో ప్రభుత్వాన్ని నిలదీశారు. బలవంతంగా రైతుల నుండి భూములు తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. మిత్రపక్షమే అయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ చేసిన ప్రతీ దానికి ఊకొట్టమని.. ప్రజల తరఫున సమస్యల మీద ప్రశ్నిస్తానని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో ఏపి సర్కార్ ల్యాండ్ పూలింగ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ చెయ్యకుండా రైతుల నుండి స్వచ్ఛందంగా భూములు తీసుకోవాలని.. అలాగే రాజధాని ఏర్పడిన తర్వాత వారికి తగిన గుర్తింను, ఉపాధినివ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తాజాగా అమరావతి శంఖుస్థాపనకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిలిచి.. స్టేజ్ కు వన్నె తీసుకురానున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles