ISIS recuiter Indian woman Afsha Jabeen aka Nicky Joseph Reveals Secrets Of Their Plans In Investigation | Hyderabad Terrorists

Isis recuiter indian woman afsha jabeen aka nicky joseph reveals secrets of their plans

isis recruiters, afsha jabeen, nicky joseph, hyderabad terrorists, isis terrorists in hyderabad, hyderabad crime news

ISIS recuiter Indian woman Afsha Jabeen aka Nicky Joseph Reveals Secrets Of Their Plans : ISIS recuiter Indian woman Afsha Jabeen aka Nicky Joseph Reveals Secrets Of Their Plans In Police Investigation.

మహిళా ఉగ్రవాది బయటపెట్టిన హైదరాబాద్ మిషన్

Posted: 10/19/2015 04:02 PM IST
Isis recuiter indian woman afsha jabeen aka nicky joseph reveals secrets of their plans

కోటిమందికిపైగా జనాభాతో కిటకిటలాడుతున్న హైదరాబాద్ నగరంలో ప్రపంచంలో పేరుమోపిన ఉగ్రవాదులు వున్నారని ఓ మహిళా ఉగ్రవాది స్పష్టం చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధమున్న ఆరోపణలతో పట్టుబడ్డ అప్సా జబీద్ నిక్కీ జోసెఫ్.. ఈ విషయాన్ని బయటపెట్టింది. గత నెలలో ఆమెను యూఏఈ ప్రభుత్వం భారత్ కు అప్పగించగా.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెను పోలీసులు విచారించగా.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఐఎస్ఐఎస్ లో రిక్రూట్ మెంట్ కు దేశవ్యాప్తంగా తొమ్మిది మంది కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ఆమె తెలిపింది. హైదరాబాద్ లో కూడా స్లీపర్ సెల్స్ చురుగ్గా పనిచేస్తున్నాయని చెప్పింది. ఐఎస్ ప్రాబల్యం భారత్ లో ఏవిధంగా విస్తరిస్తుందో పూర్తిగా వివరించింది. భారత్ లో తనతోపాటు 9 మంది ఐఎస్ రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నారని తెలిపింది. 9 మందిలో ఇద్దరు ముంబైకు చెందిన వారు కాగా మిగిలిన వారు హైదరాబాద్, బెంగళూరు, కాశ్మీర్ కు చెందిన వారని చెప్పింది. ఐఎస్ఐఎస్ కు సహకరిస్తున్న కొన్ని సంస్థల పేర్లను కూడా బయటపెట్టింది. ఈ విషయాలతోపాటు తమ ఉగ్రవాద ప్లానింగ్స్ ను కూడా ఆమె బట్టబయలు చేసినట్లు తెలుస్తోంది. నిక్కీ జోసెఫ్ యిచ్చిన సమాచారంతో ఐఎస్ రిక్రూటర్లపై ఇంటెలిజెన్స్ వర్గాలు గట్టి నిఘా పెట్టాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad terrorists  afsha jabeen  nicky joseph  isis recruiters  

Other Articles