బ్యాటింగ్ లో రికార్డులు... గ్రౌండ్ లో పరుగుల వరద పొంగాల్సిందే. బ్యాటింగ్ సత్తా ఏంటా అందరికి చూపించి.. సచిన్ తర్వాత అంతటి ఆటగాడు అని అభిమానుల చేత అభినందనలు అందుకున్నారు. ఓపెనర్ అంటే ఇలా ఆడాలి.. బ్యాటింగ్ అంటే ఇలా చెయ్యాలి అని టీమిండియాకు కొత్త క్రికెట్ చరిత్రలను అందించిన ఘనత వీరేంద్ర సెహ్వాగ్ ది. వీరేంద్ర సెహ్వాగ్ గత కొంత కాలంగా అవకాశాలు మందగించాయి. కాగా మొన్నటిమొన్న పేసర్ జహీర్ ఖాన్ రిటైర్మెంట్ ప్రకటించాడో లేదో.. భారత్‌కు చెందిన మరో దిగ్గజ క్రికెట్ బై బై చెప్పనున్నాడు. మళ్లీ జట్టులోకొచ్చే సూచనలేవీ కనిపించకపోవడంతో సెహ్వాగ్ అస్త్రసన్యాసం చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. వీరూ త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న సెహ్వాగ్ స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత రిటైర్మెంట్ను ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా సెహ్వాగ్ రిటైర్మెంట్ కేవలం మీడియాలో వచ్చిన పుకారు మాత్రమే అని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి దుబాయ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత సెహ్వాగ్ రిటైర్మెంట్ మీద క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.
సెహ్వాగ్ కెరీర్లో 104 టెస్ట్‌లు,251 వన్డేలు,19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.2013 పాకిస్థాన్‌తో చివరి వన్డే ఆడాడు వీరూ .టెస్ట్‌ల్లో 8586 పరుగులు చేసిన సెహ్వాగ్ 23 సెంచరీలు చేశాడు. 2001లో మెదటి సారిగా టెస్ట్‌ల్లో అరంగ్రేటం చేశాడు వీరూ.. లాస్ట్ టెస్ట్ ఆస్ట్రేలియాతో మార్చ్ 2013లో ఆడాడు. ఆఫ్ స్పిన్నర్‌గా ఎంట్రీ ఇచ్చిన సెహ్వాగ్ ప్రపంచంలోనే బెస్ట్ ఓపెనర్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో సందర్భాల్లో జట్టుకు ఆవలీలగా విజయాలు తెచ్చిపెట్టాడు సెహ్వాగ్. టెస్ట్‌ల్లో రెండు సార్లు ట్రిపుల్ సెంచీరులు చేసిన సెహ్వాగ్,టెస్ట్ క్రికెట్లో సరికొత్త ఒరవడికి తెరలేపాడు. వన్డేల్లో కూడా వీరూ అంటే ప్రత్యర్ధులకు దడే. సెహ్వాగ్‌కి బౌలింగ్ వేయాలంటే ఏ బౌలర్ అయినా జంకాల్సిందే. బౌండరీస్ కొట్టడంలో సెహ్వాగ్‌కు అతనే పోటీ. మెదటిసారిగా 1999 ఏప్రిల్‌లో పాకిస్థాన్‌తో వన్డే ఆడాడు. సచిన్,గంభీర్లతో ఓపెనర్‌గా వచ్చి ఎన్నో మరపు లేని ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో 15 సెంచరీలు చేసిన వీరూ...8273 పరుగులు చేశాడు.
వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్ లో అభిమానులు ఎన్నటికీ మరిచిపోలేని ఘటనలు...
టెస్టులలో...
* 2003 (మెల్బోర్న్): ఆస్ట్రేలియాపై ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఐదు గంటల్లోనే 195 పరుగుల ఇన్నింగ్స్.
* 2004 (ముల్తాన్): భారత్ తరఫున తొలి ‘ట్రిపుల్ సెంచరీ’ (319). సక్లాయిన్ బౌలింగ్‌లో సిక్స్‌తో ఈ ఘన
* 2006 (లాహోర్): ద్రవిడ్‌తో తొలి వికెట్‌కు 410 పరుగుల భాగస్వామ్యం. 247 బంతుల్లో 254 (47 ఫోర్లు).
* 2008 (అడిలైడ్): ఆస్ట్రేలియాపై రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులతో భారత్‌కు తప్పిన ఓటమి.
* 2008 (చెన్నై): 278 బంతుల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు (దక్షిణాఫ్రికాపై).
* 2009 (ముంబై): మూడో ‘ట్రిపుల్ సెంచరీ’ మిస్. శ్రీలంకపై 254 బంతుల్లో 293.
* 2010 (కోల్‌కతా): 174 బంతుల్లో 165. టెస్టుల్లో నంబర్‌వన్‌గా సెహ్వాగ్.
వన్డేలలో...
* 2001 (కొలంబో): సచిన్ గైర్హాజరులో వన్డేల్లో ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది. 69 బంతుల్లో సెంచరీ...సెహ్వాగ్ స్టయిల్ బయటపడింది.
* 2002 (కొలంబో): చాంపియన్స్ ట్రోఫీ సెమీస్. ఇంగ్లండ్‌పై 77 బంతుల్లో సెంచరీతో భారత్ ఫైనల్‌కు.
* 2009 (హామిల్టన్): 60 బంతుల్లో సెంచరీతో భారత్ తరఫన కొత్త రికార్డు.
* 2009 (రాజ్‌కోట్): 102 బంతుల్లో 146 పరుగులతో 414 పరుగుల జట్టు రికార్డు స్కోరులో కీలకపాత్ర.
* 2011 (ఇండోర్): 140 బంతుల్లో వన్డేల్లో డబుల్ సెంచరీ.
(Source: Sakshi)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more