ap cm chandrababu naidu latest press meet on special status and packages issue | narendra modi news

Ap cm chandrababu naidu latest press meet special status and packages

chandrababu naidu, narendra modi, ap special status, special packages, amaravati, amaravati city, amaravati master plan, amaravati foundation stone ceremony

ap cm chandrababu naidu latest press meet special status and packages : ap cm chandrababu naidu latest press meet on special status and packages issue.

చంద్రబాబు నోట ప్రధాని మాటలు...

Posted: 10/23/2015 10:21 PM IST
Ap cm chandrababu naidu latest press meet special status and packages

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాజధాని ‘అమరావతి’ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని మోదీ నోటివెంట ‘ప్రత్యేక హోదా’ మాట వస్తుందని అంతా భావించారు. కానీ.. అలా జరగలేదు. హోదా కాదు కదా.. కనీసం నిధుల గురించి కూడా ఆయన మాట్లాడలేదు. దీంతో ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఇదే అదును అని భావించిన విపక్షాలు తమ సత్తా చాటుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఢిల్లీ నుంచి మోదీ యమునా నీరు, పార్లమెంటు మట్టి తీసుకొచ్చి సెంటిమెంట్ పంచ్ కొట్టారే తప్ప అసలు విషయాన్ని చెప్పలేదని మండిపడుతున్నారు. ఏపీ ప్రజల నోట్లో మట్టిపోశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక్కసారిగా రకరకాల విమర్శలతో విపక్షాలు జోరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో.. బాబు మీడియా ముందుకొచ్చి ప్రజలకు వివరణ ఇచ్చుకోక తప్పలేదు.

తాజాగా విజయవాడలో మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్ర విభజన రాజకీయ కారణాలతో చేసిన విభజన అని, ప్రజలు కోరుకున్న విభజన కాదని ప్రధాని తిరుపతి సభలోను, అమరావతిలోనూ ప్రస్తావించిన విషయం అంతా గుర్తుంచుకోవాలని తెలిపారు. మీ వెంట నేనున్నానని, భుజం భుజం కలిపి నడుద్దామని ప్రధాని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. విభజన బిల్లులో పేర్కొన్న ప్రతి అంశాన్ని నెరవేరుస్తానని ప్రధాని హామీ ఇచ్చిన సంగతి మరువొద్దని ఆయన సూచించారు. అందులో భాగంగానే ఆయన రాజధానిలో భాగమయ్యానని చెప్పేందుకు మన నీరు, మన మట్టి తెచ్చారని బాబు గుర్తు చేశారు. అన్ని అవాంతరాలను అధిగమించి విజయం సాధిద్దామని ప్రధాని తెలిపారని ఆయన వెల్లడించారు. ఆ సందర్భంలోనే తాను కూడా నిధుల విషయమై చర్చించారని బాబు అన్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రధాని ప్రకటించిన ప్రత్యేకహోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అడిగానని బాబు స్పష్టంచేశారు.

తెలంగాణకు హైదరాబాదు, తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు వంటి మెట్రో నగరాలు ఉన్నాయని... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అలాంటి పట్టణాన్ని నిర్మించాలని ప్రధానిని తాను కోరినట్లుగా బాబు తెలిపారు. వీటన్నింటినీ పక్కన పెట్టి రాజధాని నిర్మాణం ఇష్టంలేని వారు అనవసరంగా ఆందోళనలు చేస్తూ రాద్ధాంతం సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. వీరికి ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యమని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణంలో రెండు దేశాలు భాగస్వాములవుతాయని ఆయన తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles