Warangal Lok sabha By-polls: Sircilla Rajaiah replaced with Sarve Satyanarayana

Sarve satyanarayana replaces rajaiah in warangal by polls

Sarve Satyanarayana in Warangal bypolls, Sarve Satyanarayana as congress candidate, Siricilla Rajaiah, Sarve Satyanarayana, Siricilla Rajaiah family fire accident, Telangana news sridhar, Siricilla Rajaiah, Siricilla Rajaiah family members, Siricilla Rajaiah fire accident, rajaiah family fire accident, siricilla rajaiah daughter in law fire accident, fire accident, Warangal bypolls

Telangana PCC replaces Sircilla Rajaiah with Sarve Satyanarayana in Warangal bypolls, due to the death of Rajaiah’s daughter in law and her children.

విధేయత విజయం: వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే

Posted: 11/04/2015 11:21 AM IST
Sarve satyanarayana replaces rajaiah in warangal by polls

వరంగల్ లోక్‌ సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అధిష్టానం ఎంపికచేసింది. .వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో చోటుచేసుకున్న విషాధం నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆయన స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణనను బరిలోకి దింపింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి విధేయుడిగా వున్న ఆయనను మరోమారు అదృష్టం వరించింది.  దీంతో ఆయన నామినేషన్ వేయడానికి వరంగల్ బయలుదేరి వెళ్లారు.

తన ఇం్లో సంభవించిన విషాదం నేపథ్యంలో ఎన్నికల బరి నుంచి తనను తప్పించాలని సిరిసిల్ల రాజయ్య వినతిని మన్నించి కాంగ్రెస్ అధిష్టానం.. తమ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణను ఎంపిక చేసింది. అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సర్వే సత్యనారాయణతో ఫోన్ లో మాట్లాడారు. ఆయనను వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థిగా నామినేషన్ వేయాలని అదేశించారు. ఆ వెనువెంటనే తెలంగాణ పిసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు కూడా ఆయనతో మాట్లాడారు.

రాజయ్య తప్పుకోవడంతో వరంగల్ లో పోటీ చేయాలని కోరారు. అధిష్టానం ఆదేశాలతో ఉప ఎన్నిక బరిలోకి దిగేందుకు సర్వే సత్యనారాయణ ఒప్పుకున్నారు. రాజయ్యను ఎంపిక చేయకముందే ఆయన వరంగల్ స్థానాన్ని ఆశించారు. ఊహించని పరిణామాలతో చివరికి ఆయకే టిక్కెట్ దక్కింది. నామినేషన్ వేసేందుకు బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి హుటాహుటిన వరంగల్ కు బయలువేరారు. దీంతో పార్టీ పట్ల, అధిష్టానం పట్ల విధేయతతో వున్నడం వల్లే సర్వేకు వరంగల్ స్థానం దక్కిందని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానించుకుంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siricilla Rajaiah  Sarve Satyanarayana  Warangal bypolls  

Other Articles