another russian cargo plane crashed in south sudan in which incident douzens of people died | cargo plane crash incident

Russian cargo plane crashes in south sudan

russian cargo plane crashed, cargo plane crashed, russian flight crashed, plane crashed in south sudan, south sudan cargo flight

Russian cargo plane crashes in South Sudan : another russian cargo plane crashed in south sudan in which incident douzens of people died.

గగనతలంలోనే కుప్పకూలిన మరో విమానం..

Posted: 11/04/2015 03:31 PM IST
Russian cargo plane crashes in south sudan

రహదారులపైనే కాదు.. గగనతలంలో కూడా విమానాలు కూలిపోతున్న ఘటనలు తరుచూ జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న 224 మంది ప్రయాణికులతో కూడిన రష్యా విమాన దుర్ఘటన మరువకముందే తాజాగా మరో విమానం ఆకాశంలోనే కూలిపోయింది.  దక్షిణసూడాన్లో కార్గో విమానం కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో కనీసం 41 మంది మరణించారు. బుధవారం దక్షిణ సూడాన్ రాజధాని జుబా విమానాశ్రయం నుంచి అపర్ నైల్ స్టేట్లోని పాలోచ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

జుబా విమానాశ్రం నుంచి విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత కేవలం 800 మీటర్ల దూరంలో ఓ చిన్న ద్వీపంలో ఈ కార్గో విమానం కూలిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్న 20 మందితోపాటు విమానం కుప్పకూలిన ప్రాంతంలో నివసిస్తున్న మరో 21 మంది మరణించారు. ప్రమాద స్థలంలో 41 మృతదేహాలను గుర్తించినట్టు ఓ పోలీస్ అధికారితోపాటు స్థానికులు చెప్పారు. రష్యాలో తయారైన ఈ కార్గో విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది. ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. మృతదేహాలను గుర్తించి, వెంటనే వాటిని కుటుంబసభ్యులకు అప్పజెప్పే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఇదిలావుండగా.. మొన్నకూలిన రష్యా విమానాన్ని తామే కూల్చామని ఐసిస్ మిలిటెంట్లు చెప్పుకోవడంతోపాటు అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు కూలిన కార్గో విమానం కూడా రష్యాలో తయారైంది కాబట్టి.. దీనిని కూల్చింది కూడా ఐసిస్ ఉగ్రవాదులేనంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. విమానం సిబ్బంది మాత్రం ఆ అనుమానాల్ని తోసిపుచ్చుతోంది. ఏదేమైనా.. ఈ విమానం కూలడానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : south sudan plane crashed  russian cargo plane crash  

Other Articles