ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలుచేశామని చెబుతున్న కెసిఆర్ వరంగల్ వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. చర్చకు సిద్ధమైతే ప్రెస్‌క్లబ్ వేదికగా సమయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరంగల్ ఉప ఎన్నికలను టిఆర్ఎస్ ప్రజలపై అనవసరంగా రుద్దిందని విరుచుకుపడ్డారు. కెసిఆర్ అహంకారానికి వరంగల్ ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటకలో సిసిఐతో పాటు సహకార సంఘాలను ఏర్పాటు చేసి, మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు చెల్లిస్తూ పత్తిని కొనుగోలు చేస్తున్నారని గుర్తు చేశారు.
పత్తి రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నయా పైసా కూడా ఖర్చు చేయడం లేదని దుయ్యబట్టారు. ఫాంహౌస్‌కే పరిమితమైన కెసిఆర్ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని అన్నారు. దేవయ్య అభ్యర్థిత్వం విషయంలో మాట్లాడే అర్హత టిఆర్ఎస్కు లేదన్నారు. పార్టీ ఫిరాయింపుతో వచ్చిన వారికి పదవులు అంటగట్టే చరిత్ర ఉన్న టిఆర్ఎస్ 42 ఏండ్లు అమెరికాలో ఉన్నా అక్కడి పౌరసత్వం తీసుకోని దేవయ్య గురించి మాట్లాడుతారా? అంటూ ప్రశ్నించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ... కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన టిఆర్ఎస్ ఇప్పుడు అక్కడ కాలు పెట్టాలంటేనే భయపడుతుందని అన్నారు. చైతన్యవంతులైన ప్రజలు టిఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more