Jennifer Lawrence falls on the red carpet, again

Jennifer lawrence falls on red carpet

Jennifer Lawrence, The Hunger Games, On The Red Carpet, Jennifer Lawrence falls on red carpet, Crime Fiction, Red, Jennifer Lawrence FALLS Over on the Red carpet, celebrity, arts

Accident prone Jennifer Lawrence took yet another tumble, this time on the red carpet at the premiere of The Hunger Games.

ITEMVIDEOS: నెట్ లో హల్ చల్.. మళ్లీ కాలుజారీన నటి..!

Posted: 11/15/2015 02:37 PM IST
Jennifer lawrence falls on red carpet

ఈ హాలీవుడ్ నటి కాలు జారి పడిపోవడంపై ఇప్పటికే రకరకాల కథనాలు వెలుగులో వుండగా, మరోమారు అమె కాలు జారీ పడిపోయింది. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా..? అమె జెన్నిఫర్ లారెన్స్.. ప్రఖ్యాత  అమెరికన్ రచయిత సుజానే కోలిన్స్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న సిరీస్  'ద హంగర్ గేమ్స్.. మాకింగ్ జే పార్ట్ 2' మూవీ   ప్రమోషన్ కార్యక్రమంలో  ఆమె కాలు జారి పడిపోయింది.  పొడవాటి తెల్లగౌనులో మెరిసిపోతూ మెట్లు ఎక్కుతున్నపుడు తడబడిందో, హైహీల్స్  మూలంగా బ్యాలెన్స్ తప్పిందో ఏమో తెలియదుకానీ, కాలు జారి కింద పడింది. కాగా ట.  వెంటనే తేరుకుని  గాల్లో చేతులు ఊపుతూ అభిమానులను నవ్వుతూ పలకరించిందట. ముద్దుగుమ్మ జెన్నీపర్ కిందపోయిన ఈ  వీడియో ఇపుడు నెట్ హల్ చల్ చేస్తోంది.

అటు ద హంగర్ గేమ్స్ ప్రొడ్యూసర్ నైనా జాకబ్ సన్  కూడా ఈ  విషయాన్ని ధృవీకరించారు.  ఆమె క్షేమం గురించి మీడియా ప్రశ్నించినపుడు ఆమెకిది అలవాటేగా.. షి ఈజ్‌ ఫైన్ అని కామెంట్ చేశారు. మరో వైపు  లారెన్స్ ఇలా వేదికలపై కాలు జారడం ఇదే మొదటి సారి కాదు.  ఆమె నటించిన 'సిల్వర్  లైనింగ్స్ ప్లేబ్యాక్' సినిమాకుగాను 2013లో ఆస్కార్ అవార్డు స్వీకరిస్తున్నపుడు కూడా  రెడ్ కార్పెట్ పై   అలా  కాలు  జారి పడింది.  అలాగే  2014  ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ లో కారులోంచి దిగుతూ కూడా అమ్మడి కాలు స్లిప్ అయింది. కాగా  ఇటీవల విడుదలైన 'ద హంగర్ గేమ్స్.. మాకింగ్ జే పార్ట్ 2'  ట్రైలర్ ఇప్పటికే సెన్సేషన్  క్రియేట్ చేస్తోంది. నవంబరు 20న థియేటర్లను పలకరించనున్న ఈ మూవీపై హాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Jennifer Lawrence  misstep  red carpet  The Hunger Games  

Other Articles