ప్రపంచానికి పెను ముప్పుగా మారిన ఉగ్రవాదం, అతివాదంపై అంతర్జాతీయ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద భూతంపై పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. జీ-20 శిఖరాగ్ర సదస్సును పురస్కరించుకొని నేతలంతా ఒక్కటయ్యారు. పారిస్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోవడంలోనూ, ఐసిస్ ఉగ్రవాద సంస్థను పూర్తిగా తుదముట్టించే చర్యలను రెండింతలు చేయడంలోనూ ఫ్రాన్సుకు వెన్నంటి ఉంటామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హామీ ఇచ్చారు.రెండు రోజుల జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిస్తున్న టర్కీ దేశాధ్యక్షుడు రెసెప్ టయ్యిప్ ఎర్గొడాన్తో ఒబామా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఫ్రాన్సుకు సంఘీభావం తెలపడానికి ఉభయులం అంగీకరించినట్టు ఆయన చెప్పారు.
''వక్రమార్గం పట్టిన సైద్ధాంతిక భావజాలానికి అమాయకులు బలిపెట్టడం అనేది కేవలం ఫ్రాన్సుపైనో టర్కీపైనో జరిగిన దాడి కాదు. అది నాగరిక ప్రపంచంపై జరిగిన దాడి'' అని ఒబామా వ్యాఖ్యానిం చారు. జీ-20 దేశాధినేతల సదస్సు ఉగ్రవాదానికి గట్టి హెచ్చరిక చేస్తుందని ఎర్గొడాన్ అన్నారు. ''అంతర్జాతీయ ఉగ్రవాదం పట్ల మా వైఖరి.. సదస్సులో అతి దృఢమైన, తీవ్రమైన సందేశం రూపంలో వ్యక్తీకరించ బడుతుం దని విశ్వసిస్తున్నాను'' అని టర్కీ అధ్యక్షుడు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఉగ్రవాద ముప్పును కలిసికట్టుగా ఎదుర్కొన్నప్పుడు మాత్రమే దాన్ని నిర్మూలించగలమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌పుతిన్ సూచించారు. ''అంతర్జాతీయ సమాజం తన ప్రయత్నాలను కలిసికట్టుగా చేసినప్పుడు మాత్రమే ఉగ్రవాద ముప్పును మనం నివారించగలం'' అని ఆయన అన్నారు. ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు వ్యక్తులు నిధులు పంపించడాన్ని ఆపడానికి, ఐసిస్‌కు సింహ భాగం నిధులు అందిస్తున్న చమురు నల్లవిపణికి అడ్డుకట్ట వేయడానికి ఉద్దేశించిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్‌ను వెంటనే అమల్లోకి తీసుకురావాలని సదరు తీర్మానం కోరవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more