They don't have the right to live in India to them

They don t have the right to live in india to them

Cow slat, India, harish Rawat, Cow meet, Beef, Cow, Dadri, Khattar, Modi govt on cow slat

Chattisgarh chief Minister Harish Rawat contraversial statements on Cowslat. He said that there no right to live in India, who kills Cows. Cows are teated as faith in India.

వాళ్లకు ఇక్కడ బ్రితికే హక్కు లేదంటున్న సిఎం

Posted: 11/20/2015 04:02 PM IST
They don t have the right to live in india to them

అవును.. ఓ రాష్ట్రానికి సిఎం ఇలా వాళ్లకు ఇక్కడ బ్రతికే హక్కులేదని వెల్లడించారు. ఎవరైతే దేశంలో గోవులను హతమారుస్తారో వారికి దేశంలో బ్రితికే హక్కులేదని ఉత్తరాఖండ్ సిఎం హరీష్ రావత్ వెల్లడించారు. ఇప్పటికే దేశంలో దుమారం రేపుతున్న గోమాంసం వివాదం మీద మరోసారి ఉత్తరాఖండ్ సిఎం నిప్పు రాజేశారు. దాద్రీ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా నిరసనల పర్వం మొదలైంది. దేశంలో పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఎంతో మంది తమ అవార్డులను కూడా తిరిగి ఇచ్చేశారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మోదీ పర్యటన సందర్భంగా నిరసన సెగలు మిన్నంటాయి. అయితే ఎన్నికల పర్వం ముగియడం.. గత కొంత కాలంగా పరిస్థితులు చక్కబడటంతో గోమాంసం వివాదం సమసినట్లు కనిపించింది. అయితే ఉత్తరాఖండ్ సిఎం వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది.

హిందువులకు గోవులు అంటే ఎంతో పవిత్రమైనవి. వాటిని పూజిస్తారు.. అలాంటి గోవులను హత్య చేస్తున్న వారికి ఇక్కడ జీవించే హక్కు లేదని ఉత్తరాఖండ్ సిఎం  హరీష్ రావత్ అన్నారు. తమ ప్రభుత్వం మాత్రమే గో రక్షణకు కట్టుబడిందని.. గోవులను పోషించేందుకు.. షెడ్ల ఏర్పాటుకు ప్రభుత్వమే స్థలాలను కూడా కేటాయించిందని అలాగే వివిధ రాయితీలు కూడా అందిస్తోందని వివరించారు. గతంలో కూడా హర్యానా ముఖ్యమంత్రి కట్టర్ కూడా దేశంలో ఉండాలంటే ముస్లింలు కొన్ని వదులుకోవాలని.. అలా గోమాంసాన్ని కూడా వదలుకోవాల్సిందే అని అన్నారు. అయితే తర్వాత తన వ్యాఖ్యలను సవరించారు. మీడియాలో అలా వచ్చాయి తప్ప.. తాను అలా అనలేదని.. తన ప్రభుత్వం అందరికి తగిన ప్రాధాన్యతనిస్తుందని వివరించారు. మరి చూడాలి ఈ సారి హరీష్ రావత్ వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపుతాయో..?

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cow slat  India  harish Rawat  Cow meet  Beef  Cow  Dadri  Khattar  Modi govt on cow slat  

Other Articles