Petition filed to bring Kohinoor from UK to Pakistan

Petition filed to bring kohinoor from uk to pakistan

Pakistan, India, Kohinoor Diamond, Case on Kohinor, kohinoor in UK, UK queen, India for Kohinoor Diamond

A petition has been filed in a Pakistani court asking the government to bring back Kohinoor diamond, the world famous precious stone which India has been trying to get from the UK. Barrister Javed Iqbal Jaffry alleged in his petition to the Lahore High Court that the UK snatched the diamond from Daleep Singh, grandson of Maharaja Ranjeet Singh, and took it to Britain.

కోహినూర్ వజ్రం పాకిస్థాన్ కు తీసుకురావాలట..!

Posted: 12/03/2015 06:32 PM IST
Petition filed to bring kohinoor from uk to pakistan

తాను దూరడానికే సందు లేదంటే మెడకేమో డోలు అన్న చందాన తయారైంది పాకిస్థాన్ పరిస్థితి. అవును తాజాగా పాకిస్థాన్ వేసిన ఓ కేసు ఇలానే ఉంది. బారత్ కే దిక్కులేదని అనుకుంటుంటే.. పాకిస్థాన్ వాళ్లు మాత్రం అది తమదే అని దాన్ని మా దేశానికి  పంపించాలని అంటున్నారు. ఇంతకీ ఏంటో అనుకుంటున్నారా..? వరల్డ్ ఫేమస్ కోహినూర్ వజ్రం గురించి.  కోహినూర్ వజ్రాన్ని యూకే నుంచి వెనక్కి తెప్పించాలని పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ దేశ కోర్టులో పిటిషన్ దాఖలైంది. జావెద్ ఇక్బాల్ జఫ్రీ అనే న్యాయవాది లాహోర్ హైకోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేశాడు. మహారాజా రంజిత్‌సింగ్ మనవడు దిలీప్‌సింగ్ నుంచి కోహినూరును లాక్కున్న యూకే దానిని బ్రిటన్‌కు తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. పిటిషన్‌లోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాణీ ఎలిజబెత్-II కిరీటంలో కోహినూరు వజ్రాన్ని పొదిగారు. 105 క్యారెట్లు ఉన్న ఈ వజ్రం బిలియన్లలో విలువచేయనుంది. పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన సాంస్కృతిక విభాగంలో కోహినూరు వజ్రం ఓ భాగం. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కోహినూరు వజ్రాన్ని పాకిస్థాన్‌కు తిరిగి తీసుకురావాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొల్లూరు గనుల్లో కోహినూరు వజ్రం లభించింది. ప్రపంచంలో ఒకప్పుడు ఇదే అత్యంత విలువైన పెద్ద వజ్రంగా ఉంది. కోహినూరు వజ్రం వాస్తవంగా కాకతీయ సామ్రాజ్యానికి చెందినది. ఈ వజ్రాన్ని ఓ హిందూ దేవత కన్నుగా పొందుపరిచారు. బ్రిటీష్ సేనలతో కలిసి పంజాబ్ రాజు కాకతీయపై దాడిచేసి ఆస్తులను జప్తు చేసి తీసుకెళ్లినట్లుగా సమచారం. జప్తు చేసిన సంపద లాహోర్‌ లోని బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరలింపబడింది. యుద్ధానికి సహాయం చేసినందుకుగాను పంజాబ్ రాజు సంపదను కంపెనీ నష్టపరిహారంగా తీసుకుంది. కాలక్రమంలో పలువురి ఆక్రమణదారుల చేతులు మారి బ్రిటన్‌కు చేరి చివరకు రాణీ ఎలిజబెత్ కిరీటంలో ఒదిగిపోయింది.

కాగా భారత్ ఎన్నో ఏళ్లుగా ఈ వజ్రాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. పలువురి మొగల్ చక్రవర్తుల సొంతమైన కోహినూరు వజ్రం సామ్రాజ్యవాద పరిపాలనలో భారత్ నుంచి అక్రమంగా తరలింపబడింది. భారత్, బ్రిటన్‌లో ఉన్న భారతీయులు కోహినూరును వెనకకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్రిటన్ పర్యటనలో సైతం భారత సంతతీ బ్రిటన్ ఎంపీ కేథీ సైతం కోహీనూరు వజ్రాన్ని భారత్‌కు ఇవ్వడంపై ప్రధానితో ప్రస్తావన గావించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles