Muslim nations join forces with military alliance to fight Daesh terrorism

Muslim nations join forces with military alliance to fight daesh terrorism

ISIS, Muslim Nations, Arab Countries, War on ISIS, ISIS Terrorists

Muslim nations around the world have decided to join forces and set up a military coalition to combat terrorism. There has been increasing pressure on Muslim nations, especially the rich Gulf states, to do more to fight against the Islamic State (Isis) militant group.

ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు

Posted: 12/16/2015 08:47 AM IST
Muslim nations join forces with military alliance to fight daesh terrorism

ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న ఐఎస్ఐఎస్ ను నిలువరించేందుకు అమెరికాతో సహా బ్రిటన్, రష్యా దేశాలు ముమ్మర చర్యలకు దిగుతున్న తరుణంలో తాజాగా ఇస్లాం దేశాలు కూడా ఆ ఉగ్రవాద సంస్థ మీద యుద్దానికి సిద్దపడుతున్నాయి. టెర్రరిస్ట్ సంస్థ ఇస్లామిక్ స్టేట్ ను మట్టుపెట్టేందుకు 34 ఇస్లామిక్ దేశాలు కంకణం కట్టుకున్నాయి. 34 దేశాల సంయుక్త సైన్యం ఉమ్మడిగా ఐఎస్ పై యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. సౌదీ అరేబియా ఈ సైన్యానికి ఆధ్వర్యం వహిస్తోంది. టెర్రరిస్ట్ లపై ఉమ్మడి వ్యూహంతో మూకుమ్మడి దాడులు నిర్వహించాలని , ఇందుకు పరస్పరం సహకరించుకోవాలని 34 ఇస్లామిక్ దేశాలు నిర్ణయించాయి.

ఇస్లామిక్ దేశాలను టెర్రరిస్ట్ దాడులనుంచి కాపాడడమే లక్ష్యంగా ఈ ఉమ్మడి సైన్యం పోరాటం సాగిస్తుంది. ఈ దేశాల్లో సౌదీ అరేబియా, ఈజిప్ట్, కతార్, యూఏఈ, మలేషియా, టర్కీ, పాకిస్తాన్, గల్ఫ్ అరబ్, ఆఫ్రికన్ అరబ్ దేశాలు ఉన్నాయి. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా దానిని నాశనం చేయాలని తీర్మానించాయి. గల్ఫ్ అరబ్ దేశాలు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ పై మరింత కఠిన చర్యలు తీసుకోవాలన్న ఐక్యరాజ్యసమితి సూచన మేరకు సౌదీ అరేబియా రక్షణమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ స్పందించారు. అయితే 34 దేశాల సైనికచర్య ఏ విధంగా ఉండపోతుంతో తెలియలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  Muslim Nations  Arab Countries  War on ISIS  ISIS Terrorists  

Other Articles