ఏపి అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. అటు ప్రతిపక్షం. ఇటు పాలకపక్షాలు ఒకరి మీద మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. రాష్ట్రంలో నిప్పురాజేసిన కాల్ మనీ వ్యవహారం మీద చంద్రబాబు సర్కార్ ను తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. అసెంబ్లీ రెండో రోజు కూడా కాల్ మనీ మీద చర్చించాలంటూ.. స్పీకర్ పోడియం వద్దకు చేరి.. సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి కాల్ మనీ మీద సిఎం ప్రకటన కన్నా ముందు చర్చకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరారు. అయితే స్పీకర్ వారి వినతిని అంగీకరించలేదు. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున ప్రకటన చేసే సమయంలో ప్రతిపక్ష నాయకులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు.
కాల్ మనీ వ్యవహారం మీద ప్రభుత్వం స్పష్టంగా ఉందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొత్తం 1 కేసు వైసీపీ నాయకుల మీదనే ఉన్నాయని వెల్లడించారు. దోషులు ఎవరైనా కూడా వారిని వదిలిపెట్టే ఛాన్సేలేదని అన్నారు. అంబేద్కర్ గురించి మాట్లాడాల్సిన సమయంలో కూడా ప్రతిపక్షాలు నిరసన తెలపడం ఏంటని మండిపడ్డారు. అయితే తాను మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్ష నాయకులు తన వైపుకు దాడికి రావడం మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మీదనే ప్రతిపక్ష నాయకులు దాడికి ప్రయత్నించడం ఏంటని ప్రశ్నించారు. కాల్ మనీ వ్యవహారంలో ఏ పార్టీ వాళ్లు ఉన్నా కానీ వదిలిపెట్టేది లేదని అన్నారు. ప్రతిపక్షాలు డౌన్ డౌన్ అని అన్నంత మాత్రాన తాను డౌన్ కానని కూడా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more