మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, వారి నుంచి గతంలో తప్పించుకున్న వారు అదే ధైర్యంతో పీకల వరకు తాగి, తమ వాహనాలను నడుపుతూ,, తమతో పాటు ఎదుటి వారి ప్రాణాలకు కూడా ముప్పు తీసుకోస్తున్నారు. ఇప్పటికే పోలీసుల విస్తృత తనిఖీల నేపథ్యంలో తాగి రోడ్డుపైకి రావడానికి సాధారణ జనం జంకుతున్న తరుణంలో..గోప్పింటి బిడ్డలు మాత్రం ప్రతి వారమూ పదుల సంఖ్యలో దొరుకుతుండగా, వారిలో ఒకరిద్దరు యువతులు పట్టుబడుతూనే ఉన్నారు. నిన్న హైదరాబాద్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న వేళ, కురచ దుస్తులు ధరించి కారులో వచ్చిన యువతి హల్ చల్ చేసింది.
మద్యం సేవించి కారు నడుపుతున్న ఆమెను పోలీసులు పరీక్షించబోగా తొలుత సహకరించ లేదు. ఆపై అతి కష్టం మీద పోలీసులు పరీక్షలు నిర్వహించి, మోతాదుకు మించిన మద్యం సేవించినట్టు తేల్చి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను తప్పించుకునేందుకు యత్నించిన ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. టీఎస్ 09 ఈఏ 7848 నంబరుపై వస్తున్న యువకులు, పోలీసులను చూసి తమ బైకును వేగంగా వెనక్కు తిప్పి వెళుతూ డివైడర్ ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో వారికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ డ్రైవ్ లో 11 కార్లు, 3 బైకులు సీజ్ చేసి 14 మందిపై కేసులు పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more