Tauba Tauba, Modi entered Pakistan without Visa says Pakistani media

Pakistani reporter freaks out tauba tauba

pakistan, nawaz sharif, india, news, narendra modi, counterpart, pm narendra modi, City 42 Reporter says “Tauba Tauba”, modi pakistan Tauba Tauba, modi, nawaz sharid tauba tauba, tauba tauba video, jago pakistan jago, hum tv, stopover at lahore

City 42 Reporter says “Tauba Tauba” on 120 People who accompanied modi without Pakistani Visas in Lahore

ITEMVIDEOS: తౌబా.. తౌబా అంటూ పరువు తీసుకున్న పాకిస్తానీ మీడియా..!

Posted: 12/28/2015 03:30 PM IST
Pakistani reporter freaks out tauba tauba

భారత ప్రధాని నరేంద్ర మోదీ మొన్న క్రిస్మస్ పర్వదినాన రష్యా నుంచి తిరిగి వస్తూ.. అకస్మికంగా అప్ఘనిస్తాన్ సహా పాకిస్థాన్ నగరం లాహోర్ లో ల్యాండ్ అయ్యి అక్కడ కూడా పర్యటనలు చేసుకుని తిరుగుపయనం అయ్యారు. రష్యా, అఫ్ఘనిస్థాన్ పర్యటనను ముగించుకుని కాబూల్ లో తిరుగు పయనమవ్వడానికి కొన్ని గంటల ముందు ఆయన ఈ వార్తను స్వయంగా తన ట్విట్టర్ ఖాతలో పెట్టి అందరనినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మోదీ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపై విశ్వవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. భారత్, పాక్ సహా అమెరికా, బ్రిటన్, చైనా చివరకు ఐక్యరాజ్య సమితి కూడా ఈ పర్యటనను స్వాగతించాయి.

అయితే పాకిస్థాన్ పర్యటన కూడా ముందుగానే ఖరారైనా.. భద్రతా కారణాలతో దానిని ముందుగానే బహిర్గత పర్చలేదు. కాగా పర్యటన వివరాలు గోప్యంగానే వుంచిన నేపథ్యంలో మోడీ సహా పలువురు అధికారులకు మాత్రం అక్కడి దేశం అప్పటికప్పుడు తాత్కాలిక వీసాలు మంజూరు చేసింది.  అయితే ఈ విషయం తెలియని పాకిస్థాన్ మీడియా మాత్రం రంద్రాన్వేషణ చేసిన. చివరకు ఎలుకను కూడా పట్టలేకపోయింది. పాకిస్థాన్ సిటీ 42 టీవీకి చెందిన ఓ జర్నలిస్టు మాత్రం ఈ పర్యటనపై అవాకులు చెవాకులు పేలాడు.

వీసా లేకుండా పాకిస్తాన్ భూభాగంలోకి భారత ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టిడమే కాకుండా ఆయన వెంట 120 మంది కూడా వీసాలు లేకుండానే వచ్చారని తప్పుడు కథనాలను ప్రసారం చేశారు. మోదీ పర్యటనను కించపరిచాడు, 'తౌబా తౌబా' అంటూ చెవులు పట్టుకుని మరీ చెప్పారు. 'పీటుసీ' ఇచ్చేటప్పుడు పలుమార్లు 'తౌబా తౌబా' అంటూ చెప్పడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆయనలా చెప్పారో లేదో, ట్విట్టర్‌లో కూడా 'తౌబా తౌబా' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడం మొదలైంది. దీంతో తౌబా తౌబా అంటూ పాకిస్తాన్ మీడియా తన పరుపు తానే తీసుకుందన్న కామెంట్లు కూడా వినబడుతున్నాయి

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra modi  Nawaz sharif  city 42 reporter  

Other Articles