Agencies decoded Pathankot attack plan on Friday morning: Sources

Terrorists may attack on delhi warns intellig3ence

terrorists, delhi, IB warn, pathankot, pathankot attack, pathankot terrorist, terroist pakistan calls, punjab sp missing car, punjab sp car abduction, punjab terror attack, pathankot terror attack, taxi driver ikagar singh, ikagar singh death, parkash singh badal, punjab news, punjab attack news, punjab news, india news

Intelligence bureau warns delhi police that terrorists may carry massacre in delhi public places

నిఘా నీడలో ఢిల్లీ.. పఠాన్కోట్ ఎయిర్ బేస్ లో కొనసాగుతున్న ఆపరేషన్

Posted: 01/03/2016 10:01 AM IST
Terrorists may attack on delhi warns intellig3ence

దేశ రాజధాని ఢిల్లీలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇంటలిజెన్స్ బ్యూరో మరోసారి హెచ్చరించింది. 15 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని, ఇద్దరు ఢిల్లీలోకి ప్రవేశించినట్టు భద్రత బలగాలకు సమాచారం అందించింది. ఉగ్రవాదులు భారీ దాడులకు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రముఖులు నివసించే ప్రాంతంలో మరింత భద్రతను పెంచారు. ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశముందని వారం క్రితం కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి.

పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఐదుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చగా, ఈ దాడిలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా  పఠాన్కోట్ ఎయిర్బేస్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రత బలగాలు నిర్ధారించాయి. ఉగ్రవాదులను సజీవంగా పట్టుకునేందుకు భద్రత బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. పఠాన్కోట్ ఎయిర్బేస్లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.  ఐఈడీ పేలుడులో నిరంజన్ సింగ్ అనే అధికారి మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఐదుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చగా, ఈ దాడిలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.ఆదివారం ఉదయం బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీ రైల్వే స్టేషన్ను బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. తనిఖీల అనంతరం రైళ్లు ఆలస్యంగా బయల్దేరాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : terrorists  delhi  IB warn  air base  pathankot  pathankot terror attack  punjab  

Other Articles