High Court gave some more time to conduct GHMC Elections

High court gave some more time to conduct ghmc elections

High Court, GHMC, GHMC elections, High court on GHMC Elections

High Court gave some more time to conduct GHMC Elections. Telangana govt cleared that on satur day they will announce the reservations and then announce the Elections notification.

జిహెచ్ఎంసీ ఎన్నికల గడువు పొడగించిన హైకోర్టు

Posted: 01/07/2016 05:02 PM IST
High court gave some more time to conduct ghmc elections

జీహెచ్ ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. జనవరి 15లోగా ఎన్నికలు పూర్తి చేయాల్ ను షెడ్యూల్ కుదిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై కోర్టు స్టే విధించింది. అనంతరం ఎన్నికల నిర్వహణకు ఫిబ్రవరి 9 వరకు న్యాయస్థానం గడువు పొడిగించింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు పాత పద్దతినే అవలంభించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఈ నెల 9లోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని తెలిపింది. సుమారు ముప్పై ఒక్క రోజుల కాల పరిమితిని హైకోర్టు పెంచింది. టీఆర్ఎస్ మొత్తం ఇరవై రోజులలో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి జి.ఓ ఇచ్చిందని,దానిని హైకోర్టు తోసిపుచ్చింది.

హైకోర్టు ఇచ్చిన తాజాగా తీర్పు మీద కాంగ్రెస్, టిడిపి నుండి పాజిటివ్ ఒపీనియన్స్ వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వానికి ఇది చెంప పెట్టులాంటిదని తెలుగుదేశం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మాగుంట గోపీనాథ్ అన్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి హైకోర్టు తీర్పును స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని, ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం చేసిన కుట్ర అని అభిప్రాయడ్డారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా టిఆర్ఎస్ ఎన్నికలను నిర్వహించడానికి ప్రయత్నిచిందని కానీ తాము ఆ ప్రయత్నాన్ని ఆపినట్లు మర్రిశశిధర్ రెడ్డి వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  GHMC  GHMC elections  High court on GHMC Elections  

Other Articles